Health: మీ కిడ్నీలు బాగుండాలంటే ప్రతిరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు

-

 

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, కిడ్నీలు ఫెయిల్ అవ్వటం వంటి సమస్యలు ఈమధ్య తరచుగా జనాలనుండి వినిపిస్తున్నాయి. మానవ శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలది ప్రధాన పాత్ర. అంతేకాదు మూత్రపిండాలు హార్మోన్లను కూడా విడుదల చేస్తాయి.అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సినన్ని నీళ్లు తాగాలి

మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. మన శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా నీరు కచ్చితంగా కావాలి. మెదడు నుండి కాలేయం వరకు ప్రతిదానికి నీళ్లు కావాలి.

మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు మూత్రం రూపంలో బయటకు పోయేలా చేస్తాయి. అయితే నీరు తక్కువగా తాగినట్లయితే మూత్రం పరిమాణం తక్కువగా ఉంటుంది. దానివల్ల వ్యర్థ పదార్థాలు కిడ్నీలలోనే ఉండిపోతాయి. ఈ కారణంగా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి.

వయసును బట్టి కావాల్సినన్ని నీళ్లు తాగితే మంచిది.

సరైన ఆహారం :

శరీరానికి చెడు చేసే కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం పూర్తిగా మానివేయాలి. పండ్లు, కూరగాయలు, ఇంకా కొవ్వులేని పాల పదార్థాలు తీసుకుంటే మంచిది.

ఉప్పు తగ్గించాలి:

ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కారణంగా మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

సిగరెట్టు మందు మానివేయాలి:

పోతాగడం వలన బీపీ పెరగడం మాత్రమే కాదు కిడ్నీల మీద కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఆల్కహాల్ అతిగా తీసుకుంటే కిడ్నీల మీద చెడు ప్రభావం పడనుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version