జ్ఞాపక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా..? అయితే వీటిని తీసుకోండి..!

-

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. జ్ఞాపకశక్తిని కూడా చాలామంది పెంచుకోవాలని అనుకుంటారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటే వీటిని తీసుకోవడం మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిషెస్ ని తీసుకోండి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బెర్రీస్ ని కూడా డైట్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండండి. స్ట్రాబెరీస్, బ్లూబెర్రీస్ వంటి బెర్రీ పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మెదడు ఆరోగ్యం దెబ్బ తినకుండా ఇవి చూస్తాయి. జ్ఞాపకశక్తిని కూడా సులువుగా పెంచుకోవచ్చు. మెదడు పనితీరు బావుండాలంటే తృణ ధాన్యాలు కూడా తీసుకోండి.

బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటిల్లో అద్భుతమైన గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడు బాగా పనిచేయాలంటే గింజలు కూడా తీసుకోండి. వాల్నట్స్, జీడిపప్పుతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గింజలను తీసుకోవడం వలన హెల్తీగా ఉండొచ్చు. పైగా జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆకుకూరలు కూడా ఎక్కువగా డైట్లో చేర్చుకోండి. ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి.

బ్రోకలీ, పాలకూర వంటి వాటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరగాలంటే కాఫీ కూడా తీసుకోవడం మంచిది. కాఫీ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది లిమిట్ గా మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నారింజ పండ్లలో విటమిన్ సి ఉంటుంది ఇది కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు. అవకాడోలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కోడిగుడ్లను తీసుకుంటే కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉండడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news