లైఫ్‌లో సెక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. శృంగార జీవితం బాగుంటే.. మిగతా సమస్యలేవి పెద్దగా అనిపించవు. ఎంత ఒత్తిడిని అయినా, టెన్షన్ అయినా.. ఇలా చేత్తో తీసేసే మంత్రం సెక్స్ మాత్రమే. కానీ ఈరోజుల్లో చాలా మంది దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కారణాలు అనేకం ఉండొచ్చు. కొన్ని మాత్రం మీ చేతులతో మీరే చేసుకుంటున్నారు. సంబంధంలో సాన్నిహిత్యం, సెక్స్ లేకుండా జీవితం సంతోషంగా ఉండదు. మంచి సెక్స్ జీవితం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. లైంగిక జీవితాన్ని నాశనం చేసే కొన్ని అలవాట్లు ఉన్నాయి.. అవేంటో ఈరోజు చూద్దాం. వాటిని వదిలించుకుంటే.. హార్స్ పవర్‌తో చెలరేగిపోవచ్చు.!
సెక్స్ చేయడం వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్ల రిలీజ్ అవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్స్. ధూమపానం మీ లైంగిక జీవితాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఒకటి నోటి దుర్వాసన, రెండు చిగుళ్ల రంగు మారడం. ఇది మీ భాగస్వామి మీతో సెక్స్ చేయడంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మీ సెక్స్ డ్రైవ్‌ను ఘోరంగా తగ్గిస్తుంది. జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ సైకియాట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం..ధూమపానం పురుషులలో అంగస్తంభన సమస్యకు దారితీస్తుందని తేలింది. స్త్రీలలో ఇది వారి లిబిడోను తగ్గిస్తుంది. కాబట్టి ఈ చెడ్డ అలవాటును వీలైనంత వరకూ తగ్గించేయండి.
సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని గడపడానికి మంచి స్టామినా కావాలి. వ్యాయామం చేయడం వల్ల మీరు మరింత చురుగ్గా ఉంటారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వ్యాయామం చేయడం వల్ల సెక్స్ జీవితాన్ని ఎక్కువ కాలం సంతోషంగా ఉంచుకోవచ్చట. లైంగిక అసంతృప్తిని తగ్గించవచ్చు.
సెక్స్ లైఫ్ బాగుండాలంటే..మంచి నిద్ర అవసరం. నిద్రలేమి సమస్యలు తక్కువ లైంగిక ఆసక్తితో ముడిపడి ఉంటాయి. ఉత్సాహం లేకుండా ప్రారంభమయ్యే సెక్స్ బోరింగ్‌గా మారుతుంది. సమయానికి పడకగదికి వెళ్లడం మంచిది. మంచి ముచ్చట్లు పెట్టుకోండి. కొన్ని విషయాలను సిగ్గు మొహమాటం లేకుండా మాట్లాడుకోండి.
కాఫీ మీ లైంగిక జీవితానికి చాలా చెడ్డది. కెఫీన్ మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పురుషులు ఎక్కువగా కెఫిన్ తీసుకుంటే, అది అంగస్తంభన సమస్యలకు దారి తీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కెఫిన్ కలిగిన పానీయాలను వదులుకోవడం వల్ల సమస్య సెట్ అవుతుంది.
ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి ఆరోగ్యకరమైన యోనిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. సురక్షితమైన జీవక్రియను నిర్వహించడానికి, మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చండి. ఇది మీ జననేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎక్కువ చక్కెర మీ యోనికి అస్సలు మంచిది కాదు. అది దుర్వాసనను కలిగిస్తుంది. శరీరంలో ఎక్కువ చక్కెర యోని ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసింది. కాబట్టి ఈ అలవాట్లకు స్వస్తి చెప్పండి..! మీ శృంగార జీవితాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లొచ్చు.