జంక్ ఫుడ్.. ఈ మాట వింటేనే ఆరోగ్యప్రియులు గుబులు చెందుతారు. ఎక్కడ జంక్ ఫుడ్ తినాల్సి వస్తుందో, తమ ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయోనని భయపడతారు. అందుకే జంక్‌ఫుడ్ తినేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తుంటారు. అయితే పలు జంక్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అలా కాదు. వాటిని తింటే ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప, అనారోగ్య సమస్యలు కలగవు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అలాంటి లాభాలనిచ్చే హెల్దీ జంక్ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పాప్‌కార్న్
పాప్‌కార్న్‌ను అందరూ జంక్ ఫుడ్ అనుకుంటారు. కానీ కాదు. ఎలాంటి ఫ్లేవర్ కలపకుండా అలాగే తయారు చేయబడిన సాధారణ పాప్ కార్న్ జంక్ ఫుడ్ కాదు. దాన్ని నిర్భయంగా తినవచ్చు. అలాంటి పాప్‌కార్న్‌ను తింటే చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. అంతేకాదు, ఆ పాప్‌కార్న్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యలను లేకుండా చేస్తుంది.
2. పిజ్జా
పిజ్జా ఆరోగ్యకరమైంది ఎలా అవుతుంది ? అని మీరు అడగవచ్చు. కానీ అన్ని పిజ్జాలు కాదు. కేవలం టమాటా పిజ్జా మాత్రమే ఆరోగ్యకరం. ఎందుకంటే టమాటాల్లో పుష్కలంగా ఉండే లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇస్తుంది.
3. డార్క్ చాకొలెట్
అన్ని చాకొలెట్లు ఆరోగ్యకరమైనవి కావు. కేవలం డార్క్ చాకొలెట్స్ మాత్రమే ఆరోగ్యకరమైనవి. వాటిల్లో అధిక శాతం కోకో ఉంటుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
4. పీనట్ బటర్
పీనట్ బటర్ అంటే.. పల్లీల నుంచి తయారుచేయబడేది. దీన్ని జంక్ ఫుడ్ గా భావిస్తారు. కానీ కాదు. నిజానికి ఈ బటర్ మనకు ఎంతో శ్రేయస్కరం. ఇందులో విటమిన్ ఇ, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వారంలో రెండు సార్లు పీనట్ బటర్‌ను తిన్నా చాలు, అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు దీన్ని తింటే అధికంగా బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది పీనట్ బటర్‌లో కొవ్వు ఉంటుందని అనుకుంటారు. అయితే అది నిజమే అయినప్పటికీ అవన్నీ మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు. ఇవి మనకు ఆరోగ్యకరమైన కొవ్వులే. కనుక భయపడాల్సిన పనిలేదు.
5. రెడ్‌వైన్
రెడ్‌వైన్ అన్ని ఆల్కహాల్ పానీయాల్లా కాదు. ఈ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే శరీరం వాపులకు గురి కాకుండా చూసే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రెడ్ వైన్‌లో ఉంటాయి.