కూన వ‌ర్సెస్ త‌మ్మినేని.. అన్ని డ్రామాలేనా…!

-

కూన ర‌వి కుమార్‌.. నిన్న‌టికి నిన్న ఒక్క‌సారిగా ఆయ‌న మీడియాలో క‌నిపించారు. గ‌తంలో ఆముదాల వ‌ల‌స నుంచి వరుస‌గా అసెంబ్లీకి గెలిచిన ఆయ‌న టీడీపీ అధినేత‌కు అనుంగు శిష్యుడిగా గుర్తింపు పొందారు. విప్‌గా ప‌ద‌విని సైతం కైవ‌సం చేసుకున్నారు. జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి కూడా చేశారు. అయితే, తాజాగా ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. సొంత బావ, ప్ర‌స్తుత అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం పై ఓడిపోయారు. అయితే, రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే కూన నియోజ‌క‌వ‌ర్గంలోనూ దూకుడు స్వ‌భావం ఉండే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

kuna ravikumar sensational comments on ycp tammineni sitaram

ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న వివాదంలో చిక్కుకున్నారు. గ్రామ వలంటీర్‌ నియామకం విషయంలో రిజర్వేషన్లు పాటించండం లేదంటూ సరుబుజ్జిలి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం సిబ్బందిని కూన రవికుమార్‌ ప్రశ్నించడమే వివాదానికి కారణమైంది. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడలేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రవికుమార్‌ ఆజ్ఞాతంలోనే ఉన్నారు. తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు సరుబుజ్జిలి ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. కూన రవి అరెస్ట్‌ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులువర్గాలు చెబుతున్నాయి.

అయితే, దీనికి స్పీక‌ర్ త‌మ్మినేనే బాధ్యుడ‌ని కూన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌పై క‌క్ష సాధింపు చ‌ర్య ల్లో భాగంగానే త‌మ్మినేని త‌న‌ను అరెస్టు చేయించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే, ఆది నుంచి కూడా ఈ కుటుంబ రాజ‌కీయాలు తెలిసిన వారు మాత్రం కూన వ్యాఖ్య‌ల‌ను కొట్టి పారేస్తున్నా రు. రాజ‌కీయంగా వివిధ పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ఈ కుటుంబం మొత్తం క‌లివిడిగానే ఉంటుంద‌ని, ఒక‌రిపై ఒక‌రు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగే ఛాన్సే ఉండ‌ద‌ని చెబుతున్నారు. కూన త‌మ్మినేనికి స్వ‌యానా బావ‌మ‌రిది అవుతారు. వీరు పైకి మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేసుకుంటార‌ని.. లోప‌ల అంతా ఒక్క‌టే అన్న‌ది అంద‌రికి తెలిసిందే.

గ‌తంలో విప్‌గా ఉన్న స‌మయ‌మంలో వైసీపీ ప‌త్రిక సాక్షి.. ర‌వికుమార్‌పై వ్య‌తిరేక క‌థ‌నాలు రాసిన‌ప్పుడు త‌మ్మినేని స‌తీమ‌ణి.. మీడియాను త‌న ఇంటికి పిలిచి.. త‌న సొంత సోద‌రుడిపై ఈ రాత‌లేంటి? ఏవో చిన్న చిన్న పొర‌పాట్లు జ‌రిగితే భూత‌ద్దంలో చూపిస్తారా? అంటూ హెచ్చ‌రించిన సంద‌ర్భాల‌ను చెబుతున్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోనూ వేర్వేరు పార్టీలే అయినా విమ‌ర్శించుకున్న సంద‌ర్బాలు త‌మ్మినేని, కూన‌ల‌కు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీలు వేరైనా రాజ‌కీయం మాత్రం వీళ్ల ఇంట్లోనే ఉండాల‌న్న‌దే వీరి టార్గెట్ అట‌. గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఈ ఇద్ద‌రూ ఆముదాల‌వ‌ల‌స‌లో పోటీ ప‌డుతున్నారు. ఒక‌సారి ఇద్ద‌రూ ఓడిపోగా… ఆ త‌ర్వాత చెరోసారి విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలో కూన ఇప్పుడు సీతారాం టార్గెట్‌గా చేస్తోన్న వ్యాఖ్య‌ల్లో ప‌స‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిప‌స్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version