కరోనా విస్తరిస్తున్నవేళ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుందామిలా.. !

-

రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అందరిలోనూ ఆందోళన పెరిగిపోతుంది. అయితే మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. శరీరంలో ఎప్పుడయితే వ్యాధినిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. అందుకనే వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడుతాయి. వీటిని మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. బాగా కాచిన కప్పు వేడిపాలల్లో అరచెంచా పసుపు కలిపి తాగాలి. ఇంట్లో వేపాకులు లేదా సాంబ్రాణి పొగను నిత్యం వేసుకోవాలి. ఇలా గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చు.

immunity boosting
immunity boosting

స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.అలాగే సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలు మీ శరీరంలో పెరగడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, విటమిన్ సి పెంచడానికి రోజూ ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు జాతిలోకి ఆరెంజెస్, నిమ్మరసం, గ్రేప్స్, సిట్రస్, బెర్రీస్ మొదలైన పండ్లు అన్ని కూడా ఈ కోవలోకే వస్తాయి. ఆకుపచ్చ రంగు కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వంటకి మంచి సువాసన ఇవ్వడం మాత్రమే కాదు.

జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.అలాగే ప్రతిరోజు ఒక కప్పు నీటిని మరగించి అందులో రెండు చిటికెల మిరియాలపొడి, చిటికెడు లవంగాలపొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కాచాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి మరిగించాలి. చివర్లో అయిదారు తులసాకులు కూడా వేసి దింపాలి. తరువాత దీనికి చెంచాడు తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది.అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వకాలం నుంచి చెబుతున్నారు. అల్లంని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది .ఇలా పైన చెప్పినవన్నీ చేయండి.. వ్యాధినిరోధకతను పెంచుకోండి.. !!

Read more RELATED
Recommended to you

Latest news