సరిపోయినంత నిద్రపోతున్నారా.. తెలుసుకునేందుకు ఒక్కటే మార్గం!

-

చాలా మంది వేళకి తింటున్నామా సరిగ్గా నిద్ర పోతున్నామా అనేవి పట్టించుకోరు. ఇది కేవలం చిన్నవే అని వీటిని కనీసం లెక్క చేయరు. కానీ వేళకు తినడం సరిగ్గా నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే తిండి నీరు అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం కాబట్టి వీటన్నిటిని సక్రమంగా ఉంచుకోవాలి. అయితే దీని వల్ల ఏం లాభం కలుగుతుంది అనుకుంటున్నారా..? మరి ఆలస్యం చేయకుండా దీనిని పూర్తిగా చదివితే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

sleep problems
sleep problems

ఆహారం వ్యాయామం నీటితో పాటు మన జీవితానికి నిద్ర కూడా ఎంతో ముఖ్యం కాబట్టి సరైన సమయానికి నిద్ర పోవడం చాలా మంచి అలవాటు. సరిగ్గా నిద్ర పోకపోతే మరుసటి రోజు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన సంగతి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఏడు గంటల పాటు నిద్ర పోవాలి లేక పోతే ఎన్నో అనారోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి.

అలానే ఎంత సమయం నిద్రపోతున్నారు అనే విషయంతో పాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిద్రపోతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం, దీని వల్ల కూడా ఆరోగ్యం ప్రభావం చూపుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి రోజుకు ఏడు గంటలు నిద్రపోతున్నారు అనుకుందాం. 10:00 ఇంటికి నిద్రపోయి తెల్లవారి 5 గంటలకి లేవడం ఒక లెక్క లేదా వాళ్ళు 12 గంటలకు నిద్రపోయి ఉదయం ఏడు గంటలకు లేవడం మరొకటి. అర్ధరాత్రి నుండి పడుకునే ఉదయం 9 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.

ఏదైనా ఏడు గంటలే కదా అని అలా కొన్ని పొరపాట్లు చేయకండి. ఏ సమయంలో నిద్ర పోతున్నారు కూడా చాలా ముఖ్యం. టీనేజ్ పిల్లలు రాత్రి లేట్ గా పడుకుని పొద్దున్నే లేటుగా లేస్తుంటే వారు ఎలర్జీల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఒక పరిశోధనలో 1684 టీనేజ్ పిల్లలు తీసుకున్నారు. వాళ్ళు పడుకునే టైం అలాగే ఎలా లేస్తారు ఏ టైంలో చురుగ్గా ఉంటారు ఇలా ఎన్నో ప్రశ్నలు పైన పరిశోధనలు చేశారు. దీని ద్వారా ఏం తెలిసింది అంటే లేటుగా పడుకునే లేటుగా లేచే టీనేజర్లలో ఆస్తమా ఎలర్జీలు వచ్చే అవకాశం ఉందని మిగిలిన వారి కన్నా మూడు రెట్లు అధికంగా వారిలో ఉంటుందని తేలింది.

వీళ్ళు పరిశోధన చేసినప్పుడు ఆరోగ్య సమస్యలు గురించి ఆస్తమా ఉందా తుమ్ములు జలుబు ఏమైనా ఎక్కువగా ఉంటాయా. ఫ్యామిలీలో ఎవరికైనా స్మోక్ చేసే అలవాటు ఉందా ఇలా వివిధ ప్రశ్నలు కూడా వీళ్ళు అడిగి పరిశోధన చేయడం జరిగింది. అలానే తెల్లవారి లేటుగా లేచిన మన బాడీ క్లాక్ కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే ఇటువంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news