హెయిర్‌ స్పాతో నిజంగానే జుట్టు సమస్యలు పోతాయా.?

-

ఈరోజుల్లో జుట్టు సమస్యలు లేని వారు చాలా అరుదు.. అందిరికీ జుట్టు విషయంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. అసలే ఇది వర్షాకాలం.. బయటకు వెళ్లినప్పుడు వర్షంలో తడిస్తే..హెయిర్‌ ఇంకా ఊడిపోతుంది. వెంట్రుకలు జిడ్డుగా మారండ, నిర్జీవంగా మారుతుంది. అయితే కొందరు హెయిర్‌ స్పా అంటూ వెళ్తారు. అసలు హెయిర్‌ స్పా చేసుకోవడం హెయిర్‌కు మంచిదేనా..దీనివల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయా..?
హెయిర్‌ స్పా వల్ల వెంట్రుకలలో చెమట కారణంగా ఏర్పడే బ్యాక్టీరియా తొలగిపోతుంది. హెయిర్‌ స్పా’తో వెంట్రుకలకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయట. వెంట్రుకలు సున్నితంగా మారతాయి. మెరుస్తుంటాయి. ఈ ట్రీట్‌మెంట్‌ను నెలలో 2సార్లు చేయిస్తే చాలు. హెయిర్ స్పాలో వాడే సహజ పదార్థాలు మీ జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో హెల్ప్‌ అవుతాయి. హెయిర్ స్పా రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మన స్కాల్ప్‌కు చాలా మేలు చేస్తుంది.
జుట్టు కుదుళ్లు, మూలాలకు పోషణను అందిస్తుంది.ఇంకా స్కాల్ప్‌ను లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దుమ్ము, మలినాలను శుభ్రంగా తొలగిస్తుంది. హెయిర్ స్పా హెయిర్ రూట్స్, స్కాల్ప్‌ను లోతుగా కండిషన్ చేస్తుంది. ఇది బలమైన జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. ఈ డీప్ కండిషనింగ్ ప్రయోజనం దెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
చిట్లిన చివర్లను వదిలించుకోవడానికి హెయిర్‌ స్పా బాగా పనిచేస్తుంది. చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ స్పా సమయంలో చేసే తల మసాజ్ మెదడు నరాలకు చాలా విశ్రాంతి దొరుకుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది. తలలో అదనపు నూనె స్రావాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. స్కాల్ప్‌లో అధికంగా ఉండే నూనె వల్ల స్కాల్ప్‌లో దురద, జిగట, దుమ్ము, కాలుష్య కారకాలు పేరుకుపోతాయి. హెయిర్ స్పా హెల్తీ హెయిర్ పొందడానికి ఉత్తమ మార్గంగా సౌందర్య నిపుణలుు చెబుతున్నారు.
కాబట్టి..మీకు విపరీతమైన జుట్టు సమస్యలు ఉండి, చాలా ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటే..ఒకసారి హెయిర్‌ స్పా చేయించుకోండి. నిపుణులు మంచిదే అంటన్నారు కాబట్టి ట్రై చేయడంలో తప్పు లేదు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version