మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా..? అయితే ఈ జాగ్రత్తలు ముఖ్యం…!

-

మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇట్టే జబ్బులు బారిన పడతారు. మరి పెంపుడు జంతువులు జబ్బు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కుక్కలను సంరక్షించుకోవాలంటే పరిశుభ్రమైన ప్రాంగణం లోనే ఉంచాలి. ఆహారం మరియు నీళ్ళ కోసం వాడే గిన్నెలు శుభ్రంగా ఉండాలి. ఒక జీవికి మరో జీవికి చాలా తేడాలు ఉంటాయి.

కనుక మీ పశు వైద్యుడుని కలిసి ఆ జీవికి ఎన్ని పోషక విలువలు అవసరమో తెలుసుకుని దాన్నిబట్టి ఆహారాన్ని అందించాలి. కుక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా అందించాలి. ఆహారం తో పాటు తాజా నీటిని అందుబాటులో ఉంచాలి. పెంపుడు కుక్కలకు అయితే ఎక్కువ శక్తి అవసరం ఉండదు, కాబట్టి ఆహారాన్ని ఎక్కువగా పెట్టకూడదు. అవి ఎక్కువగా నిద్ర పోయి కావలసిన శక్తిని పొందుతాయి. మితిమీరిన ఆహారం పెట్టడం వల్ల బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

చల్లని వాతావరణం ఉంటే కుక్కలు జబ్బున పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉంచితే ఫ్లోరింగ్ పై మందంగా దుప్పటిని పరవాలి, రాత్రి అయ్యే సరికి చలి ఎక్కువ అవుతుంది మరియు మితిమీరిన చల్లదనం వల్ల కుక్కలకు న్యూమోనియా వంటి జబ్బులు వస్తాయి. కాబట్టి రాత్రి సంరక్షణ ఇంకా తప్పనిసరి. పెంపుడు జంతువులు పెంచుకునే ముందు వాటిని పశువుల ఆసుపత్రి కు తీసుకువెళ్లి టీకాలు వేయించాలి మరియు ఆ రికార్డు కాపీని దగ్గర ఉంచుకోవాలి.

సాయంత్ర సమయంలో మీ కుక్క ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే వ్యాయామాన్ని చేసేలా చూడండి. వాకింగ్ కు తీసుకువెళ్లడం, బాల్ విసిరి పరిగెత్తేలా చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల జబ్బున పడకుండా ఉంటుంది. కుక్కలు ఎక్కువగా చిగుళ్ళ వ్యాధికి గురవుతాయి. కాబట్టి డెంటల్ కేర్ చాలా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు గ్రూమింగ్ మరియు నెయిల్ ట్రిమ్మింగ్ చేయించడం అసలు మర్చిపోకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version