చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకునే చిన్న చిన్న చిట్కాలు..

-

రక్తంలో చక్కెర శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారా? చక్కెరని ఎలా నియంత్రించాలో తెలియక తికమక పడుతున్నారా? ఐతే ఇది మీకోసమే. చక్కెర వ్యాధిని నియంత్రించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు ఎలా పనిచేస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.

సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం

చక్కెర వ్యాధికి అదుపులో ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రతీ రెండున్నర గంటలకి లేదా 3గంటలకి ఒకసారి ఆహారాన్ని తీసుకోవాలి. 5గంటల కంటే ఎక్కువ సేపు ఆహారం తినకుండా ఉండడం మంచిది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు, తృణ ధాన్యాలు.. బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ మొదలగునవి తినండి.

రిఫైన్ చేసిన సిరీల్ ఉత్పత్తులు, వైట్ బ్రెడ్, నూడుల్స్, వైట్ రైస్ పక్కన పెట్టండి. క్రమం తప్పని వ్యాయామం కూడా రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. ఐతే వర్కౌట్ చేసే ముందు, చేసిన తర్వాత చక్కెర శాతాన్ని గమనించుకోండి. మరీ ఎక్కువ వ్యాయామం వల్ల చక్కెర శాతం అధికంగా పెరగడమో, అల్పానికి పడిపోవడమో జరుగుతుంది.

కొవ్వు స్థాయిలను గమనించండి

కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలైన పిజ్జా, బర్గర్, ఫ్రై చేసిన స్నాక్స్ మొదలగు వాటిని మీ ఆహారంలో నుండి తీసివేయండి.

చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించండి.

డయాబెటిక్ తో బాధపడేవారు వారి శరీరంలో చక్కెర స్థాయిలను గుర్తించడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలను గుర్తిస్తూ అప్రమత్తంగా ఉండడం బెటర్. గ్లూకోమీటర్ చేతిలో ఉంచుకుంటే బాగుంటుంది.

మందులు

డయాబెటిస్ ఉన్నవారు మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన సమాయానికి మందులు వేసుకుంటే మంచిది. లేదంటే ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

బరువు

ఎక్కువ బరువు ఎక్కువ చక్కెర స్థాయిలను పెంచవచ్చు. అందుకే ఊబకాయాన్ని పోగొట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version