తులసి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ..!

-

మన దేశం లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో డాక్టర్ అవసరం లేకుండా ఈ ఔషధి మొక్కలను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నియంత్రి స్తారు. వీటిల్లో తులసి ప్రధానమైనది. తులసి మన ఇంటి ఆవరణలో నే ఉంటుంది. కనుక దీన్ని మన పాలిట కల్ప వృక్షం అనే చెప్పుకోవాలి.ముఖ్యంగా తులసితో మన ఇంటి ఆవరణలోని, మన ఆరోగ్య పరంగా ను చాలా ఉపయోగాలు ఉన్నాయి.

అవేమిటి అంటే తులసి మన ఇంటి ఆవరణలో ఉంటే ఆ చెట్టు యొక్క ఆకుల నుండి వచ్చే యుజే నాల్ నూనె లాంటి పదార్ధం వలన ఇంటి లోకి ప్రవేశించే క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా నశిస్తాయి. సహజంగా తులసి మొక్కని మన ఇంటి ముందు వేసుకుని పూజిస్తారు అనే అందరికీ తెలుసు. కానీ ఇది పలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యం గా శీతా కాలం లో వచ్చే దగ్గు, జలుబు లకు మంచి మందు. తులసి ఆకులు రోజూ రెండు నమలటం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.

తులసి వేర్లు అరగదీసి వాపులు ఉన్న దగ్గర రాస్తే వాపు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. తులసిని వాడటం వల్ల రక్తంలోనీ కొలెస్ట్రాల్ తగ్గి రక్తం శుద్ది చేయ బడుతుంది. తులసి ఆకులతో హెర్బల్ టీ తయారు చేసుకొని తాగితే గుండె కు మంచిది. తులసి ఆకులు రసం, కొద్దిగా అల్లం రసం తీసి దానిలో కొంచెం తేనె కలిపి సేవిస్తే కఫం నివారించవచ్చు. తులసి ఆకులు, మిరియాలు, కరక్కాయ, ఖండ చక్కెర ఈ నాలుగింటిని ఒక పావు లీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి.నాలుగో వంతు నీరు మిగిలాక దింపి వడపోసుకుని దానికి కొద్దిగా తేనె కలిపి రోజుకు నాలుగు సార్లు తీసుకుంటే ఎటువంటి జ్వరమైనా తగ్గి పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news