ఈ కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చెయ్యండి…!

-

ప్రస్తుతం అందరూ ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉంటున్నారు. వంటింట్లో సమయాన్ని కేటాయించడానికి కూడా తీరిక ఉండడం లేదు. ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టి మర్చి పోవడం వల్ల అవి తొందరగా పాడైపోతున్నాయి, ఇలా చాలామంది సమయం లేకపోవడం వల్ల శ్రద్ధ పెట్టడం లేదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించి ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.

బీట్ రూట్ :

ఫ్రిజ్లో పెట్టినా సరే బీట్రూట్ ఒక్కొక్కసారి తొందరగా మెత్తబడుతుంది. ఇలా మెత్తబడి పోకుండా ఉండాలంటే వాటిని చెక్కు తీసి సన్నని ముక్కలుగా తరుక్కుని ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు
గట్టిగా ఉంటాయి.

క్యారెట్ :

ఇవి కూడా కొద్ది రోజులకే మెత్తబడి పాడైపోయే అవకాశం ఉంది. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే చెక్కు తీసి ముక్కలుగా కోసుకుని ఒక డబ్బాలో నీళ్ళు వేసుకొని ఆ ముక్కలు నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు మెత్త గా అవ్వవు.

పన్నీర్ :

ఎంతో త్వరగా పాడైపోయే పనీర్ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే ఇలా చేయడం మంచిది. పనీర్ను బ్లాటింగ్ పేపర్లో చుట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

కాకరకాయలు :

కాకరకాయలు కొన్ని రోజులకే పండిపోతాయి. ఇలా అవకూడదు అనుకుంటే కాకరకాయలను ముక్కలుగా తరుక్కుని స్టోర్ చేసుకోవాలి. అలా అయితే ఎక్కువ రోజులు పండిపోకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news