జగన్ లేఖ రాశారు.. కానీ ఢిల్లీకి అందలేదు !

Join Our Community
follow manalokam on social media

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నారా లోకేష్ కీలక కామెంట్స్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే తరిమితరిమి కొట్టే రోజులు వస్తాయన్న ఆయన లాభసాటిగా లేదని ప్రైవేటీకరణ అంటున్నారని, ఇది చాలా దారుణం అని అన్నారు. వైసీపీకి 28మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు ? గాడిదలు కాస్తన్నారా ? అని లోకేష్ ప్రశ్నించారు. మోడీకి లేఖ రాశా అని ముఖ్యమంత్రి అంటున్నారు, ఢిల్లీలో అడిగితే ఏ లేఖ అక్కడ అందలేదని అంటున్నారని అన్నారు.

ఒక స్టీల్ ప్లాంట్ గురించి లేఖ  రాయ లేని వ్యక్తి ప్రత్యేక హోదా సాధిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు.  అద్భుతమైన పరిశ్రమను మూత పడే పరిస్థితికి తీసుకు వస్తారా ? అని ప్రశ్నించిన ఆయన మాయమాటలు చెప్పి తప్పించుకునే రోజులు పోయాయని ట్వీట్ రెడ్డి, జగన్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూసి పల్లా దీక్షకు కూర్చున్నారని నిరాహార దీక్షతో ప్రభుత్వంతో కదలిక వస్తుందని భావిస్తున్నానిన్ అన్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....