వయాగ్రా తీసుకున్నా ఇలాంటి వ్యక్తులపై అది ఏమాత్రం పనిచేయదు.. ఎందుకంటే..

-

హార్స్‌ పవర్‌ ఎప్పుడూ ఒక మనిషికి ఒకేలా ఉండదు. వయసు పెరిగే కొద్ది తగ్గుతుంది. అందుకే కొంతమంది ఆ వేడి కావాలనే.. వయాగ్రా వాడుతుంటారు. వయాగ్రా వేసుకుని సెక్స్‌ చేస్తే.. మళ్లీ అదే స్పీడ్‌తో రెచ్చిపోవచ్చు అనుకుంటారు. అయితే కొన్నిసార్లు వయాగ్రా వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వయాగ్రా కొందరిపై పనిచేయదని వైద్యులు అంటున్నారు. అయ్యో పాపం ఎవరు వాళ్లు అనుకుంటున్నారా..?

30 ఏళ్లు పైబడిన పురుషులలో 10 మందిలో ముగ్గురికి టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది పురుషులు తమ లైంగిక జీవితాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి వివిధ కృత్రిమ మార్గాలను పాటిస్తున్నారు. నలభై ఏళ్లలోపు పురుషులు కనీసం 50 శాతం మంది అకాల స్కలనంతో సహా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వయాగ్రా వాడే వారిలో కనీసం 31 శాతం మంది పురుషులకు వయాగ్రా మాత్రలు పనికిరావని తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో యువకులు కూడా వయాగ్రా మాత్రలను వాడుతుంటారు. తమ పవర్ చూపించాలని ఉత్సహంగా ఉంటారు. కానీ అస్సలు మంచిది కాదు. దీని ఫలితంగా అకాల స్కలనంతో సహా లైంగిక సమస్యలు పెరుగుతాయి.

వయాగ్రా శారీరకంగా నపుంసకత్వమున్న పురుషులకు ఉపయోగకరం. వైద్యుల సలహాను అనుసరించి దాని నుంచి బయటపడేందుకు వీటిని ఉపయోగిస్తారు. దీని వాడకం వల్ల ప్రైవేట్ పార్ట్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి లైంగిక సంపర్కం సులభతరం అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల వయాగ్రా పని చేయదు.

వయాగ్రా తీసుకున్న మొదటి 30 నిమిషాలలోపు శృంగారం లేదా ఉత్తేజపరిచే కార్యాచరణ లేకుంటే కొన్నిసార్లు వయాగ్రా పని చేయదు. అప్పుడు మీ చేతికి పనిచెప్పాల్సిందే. వయాగ్రా తీసుకున్న తర్వాత కొంతమంది పురుషులు కడుపు సమస్యలు లేదా తలనొప్పిని దుష్ప్రభావాలను చూస్తారు. అలాగే, కంటి, కిడ్నీ, కాలేయం లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈ మాత్ర వేసుకోకూడదు. ఎందుకంటే ఇది వారికి చాలా తక్కువ పని చేస్తుందట.

మీరు అలసట లేదా బద్ధకంతో ఉన్నట్టయితే వయాగ్రా మాత్రలు పనిచేయవు. మీ అలసటతో మీకే ఓపిక ఉండదు. ఆల్కహాల్ పదే పదే తీసుకుంటుంటే.. కొన్ని రోజులకు ఎక్కువ తాగాల్సి వస్తుంది. అప్పుడే కిక్కు ఎక్కుతుంది. అలాగే పదేపదే వయాగ్రా వాడిన తర్వాత శరీరం వయాగ్రాకు నిరోధకతను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా, వయాగ్రా పనిచేయదు. డోస్ పెంచితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

సెక్స్‌కు ముందు ఆల్కహాల్ తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. తర్వాత అంగం గట్టి పడదు. అంతేకాదు.. ఆల్కహాల్ తీసుకుని వయాగ్రా వాడితే ప్రాణానికే ప్రమాదం. అలా చేసి చనిపోయినవారూ ఉన్నారు.

వయాగ్రా ఎటువంటి కారణం లేకుండా కొంతమందికి పని చేయదు. ఎందుకంటే.. సెక్స్‌పై కోరిక లేకపోతే, వయాగ్రా తీసుకున్నంత మాత్రన పని జరగదు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే వయాగ్రా మాత్రలు కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మాత్రలను ఎప్పుడూ వాడకూడదు. ఇది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news