వీడియో గేమ్స్ ఆడితే హార్ట్ ఎక్సర్ సైజ్ చేసినట్టే…!

-

ఒరేయ్ చింటూ ఎప్పుడూ ఆ వీడియో గేమ్సేనా.. చదువయితే ఒక్క ముక్క చదవవు.. ఆ వీడియో గేమ్స్ ఆడితే ఏమొస్తది అంటూ తల్లిదండ్రులు తెగ చిరాకు పడుతుంటారు. ఇది ఒక్క చింటూ ఇంట్లోనే కాదు.. ప్రతి ఇంట్లో రోజూ జరిగేదే. పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అవి ఆడటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. ఈ పిల్లలు ఎప్పుడూ వీడియో గేమ్స్ అంటూ ఎగబడుతారు.. అంటూ తల్లిదండ్రులు కూడా తెగ మండిపడుతుంటారు. అలాంటి తల్లిదండ్రుల కోసమే ఈ వార్త.

ఇప్పటి నుంచి మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడితే ఏమనకండి. రోజులో ఓ అర్ధగంటో… గంటో ఆడినా పర్వాలేదు. ఎందుకంటే.. వీడియో గేమ్స్ ఆడితే గుండె కోసం వ్యాయామం చేసినట్టేనట. దీంతో గుండెకు సంబంధించిన రోగాలు ఏవీ దరిచేరవట. ఇది మేము చెబుతున్నది కాదు.. యూఎస్ లోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాటలు ఇవి. వీడియో గేమ్స్ ఆడుతుంటే.. గుండెకు రక్తసరఫరా బాగా జరుగుతుందని రీసెర్చర్స్ చెబుతున్నారు. రీసెర్చ్ కోసం కొంతమందిని తీసుకొని వారితో వీడియో గేమ్స్ ఆడిస్తూ గుండె పనితీరును గమనించిందట ఈ బృందం. దీంతో వారి గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా వారి గుండెకు వచ్చే రక్త ప్రసరణ కూడా బాగా జరిగినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news