weight loss tips : డైట్ పాటింకాకుండా బరువు తగ్గడానికి ఏం చేయాలంటే

-

బరువు తగ్గాలనుకున్న వారు ఖచ్చితంగా పాటించి తమకు నచ్చిన ఆహార పదార్థాలను దూరం చేసుకుని నోరు కట్టుకుని ఉండాల్సిన పనిలేదు. దానికోసం కొన్ని ముఖ్యమైన Weight loss tips విషయాలను తెలుసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ పద్దతిలో బరువు తగ్గడం కొద్దిగా ఆలస్యం కావచ్చు. కానీ ఆహారంపై మీ అభిరుచి పోకుండా హాయిగా బరువు తగ్గవచ్చు.

Weight loss tips and diet

ప్రతిరోజూ అల్పాహారం

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు చేసే మొట్ట మొద‌టి పొర‌పాటు బ్రేక్ ఫాస్ట్‌ని స్కిప్ చేయ‌టం. బ్రేక్ ఫాస్ట్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆక‌లి ఎక్కువ అవ‌టంతో ఎక్కువ తిన‌డం జ‌రుగుతుంది. అల్పాహారం తీసుకునే వారి కంటే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారిలో ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌లు స‌ర్వేల్లో తేలింది. సో బ‌రువు త‌గ్గాల‌నుకుంఏ మాత్రం అల్పాహారం క‌చ్చితంగా తీసుకోవాలి.

వ్యాయామం

మీ శరీర బరువును తగ్గించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఆహారం ద్వారా మీ శరీరానికి అందిన అధిక కొవ్వును కరిగించడానికి వ్యాయామం చక్కటి మార్గం. ఆహారం తినకుండా బరువు తగ్గాలనుకోవడం సరైన పని కాదు. దానివల్ల ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవాళే వ్యాయామం ప్రారంభించండి.

మనస్ఫూర్తిగా తినండి

బరువు తగ్గడానికి ఆహారం మానేయడానికి బదులు మనస్ఫూర్తిగా తినడం నేర్చుకోండి. మీ పొట్టకి కావాల్సినంత మాత్రమే తినండి. మనస్ఫూర్తిగా తినడం వల్ల మీ పొట్టకి ఎంత సరిపోతుందో మీ మెదడు సంకేతాలు అందిస్తుంది. అందుకే తినేటపుడు స్మార్ట్ ఫోన్ వాడడం, టీవీ చూడడం చేయవద్దు.

సరిగ్గా నమలండి

ఆహారాన్ని సరిగా నమిలి తింటున్నారో లేదో చూసుకోండి. ఇది జీర్ణక్రియకే కాదు ఆహారాన్ని ఎక్కువ తినకుండా చూసుకుంటుంది. దానివల్ల అధిక కేలరీలు శరీరాన్నికి చేరవు.

నీళ్ళు బాగా తాగండి

ఎక్కువ తినడం వల్ల మీ శరీరానికి చేటు కలుగుతుంది. దాన్నుండి బయటపడడానికి ఎక్కువ నీళ్ళు తాగండి. దీనివల్ల తొందరగా ఆకలి వేయదు. అప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఒత్తిడి తగ్గించుకోండి

చాలామంది ఒత్తిడిలో ఎక్కువ తింటుంటారు. అందుకే బరువు పెరుగుతుంటారు. ఒత్తిడి ఎక్కువైతే తినే ఆహారం మీద నియంత్రణ ఉండదు. ఆకలి ఎక్కువ అవుతున్నటు అనిపించి ఎక్కువ ఆహారాన్ని శరీరానికి అందించేలా ఒత్తిడి చేస్తుంది. అందుకే ఒత్తిడిని పక్కన పెట్టండి. అప్పుడే బరువు తగ్గుతారు.

ఈ సూచ‌న‌లు పాటిస్తూ బ‌రువు సుల‌భంగా త‌గ్గ‌వ‌చ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? బరువు తగ్గడానికి చిట్కాలు మ‌రిన్ని చూద్దాం.

ఇలా చేస్తే సులువుగా బరువు తగ్గచ్చు…!
|బరువు పెరగాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

Read more RELATED
Recommended to you

Exit mobile version