ఏపీ : గ్రామ వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్..!

-

ఏపీలో గ్రామ‌, వార్డు స‌చివాలయ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందింది. అక్టోబ‌ర్ 2 నాటికి స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప్రొబేష‌న్ డిక్లేర్ చేయాల‌ని కోర‌గా సీఎం వెంట‌నే సానుకూలంగా స్పందించి అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం చైర్మెన్ కె. వెంక‌ట రామిరెడ్డి ప్రొబెష‌న్ ను పూర్తి చేసుకుని వెంట‌నే రెగ్యుల‌ర్ పేస్కేల్ ప‌రిధిలోకి వ‌స్తార‌ని వెల్ల‌డించారు. వెంక‌ట రామిరెడ్డి విజయ‌వాడ‌లో జ‌రిగిన ఏపీ గ్రామ‌,స‌చివాల‌య ఉద్యోగుల సంఘం కార్య‌వ‌ర్గ స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ సంధ‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…వైసీపీ ప్ర‌భుత్వం లోకి రాగానే రాష్ట్రంలో 1.34ల‌క్ష‌ల మందికి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఉద్యోగాల‌ను క‌ల్పించిందని చెప్పారు. న‌వంబ‌ర్ లో ల‌క్ష‌మందితో కృత‌జ్ఞ‌త స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీస‌కున్నారు. అలాగే ఉద్యోగుల‌కు సంబంధించిన ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌ని….డిపార్ట్ మెంటల్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారంద‌రికీ ప్రొబేష‌న్ డిక్లేర్ చేస్తామ‌ని చెప్పారు. డిపార్ట్మెంటల్ టెస్ట్ లేని ఎనిమిది శాఖ‌ల‌కు ఎలాంటి ప‌రీక్ష‌లు లేకుండా ప్రొబేష‌న్ డిక్లేర్ చేయాల‌ని కోరిన‌ట్టు తెలిపారు. ప్ర‌సూతి సెల‌వులో ఉన్న మ‌హిళా ఉద్యోగుల స‌ల‌వు దినాల‌ను ప‌నిదినాలుగా ప‌రిగ‌ణించి వారికి కూడా ప్రొబేష‌న్ డిక్లేర్ చేయాల‌ని కోరిన‌ట్టు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version