శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా?

-

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. కష్టాలు రానంత వరకు దేవుడు గుర్తుకురాడు. అలాగే ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోం. ఎప్పుడైనా ఆనారోగ్యం వస్తే మాత్రం ఎందుకిలా అయిందన్న డౌట్ వస్తుంది. అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనిపిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అది ఎందుకు అవసరమో లోపించకుండా ఏం చెయ్యాలో చూసుకుందాం.

మనిషి శరీరంలో ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం బాడీలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), కొవ్వు, ప్రోటీన్స్ (మాంస పదార్థాలు) నుంచీ.. మనకు ఎనర్జీ వచ్చేలా చెయ్యడంలో మెగ్నీషియం కీలకపాత్ర వహిస్తుంది. మెగ్నీషియం అత్యంత అవసరం మనకు. ఇది మంచి ఎనర్జీతోపాటు చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్‌షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. వాటితోపాటూ.. డార్క్ చాకొలెట్స్‌లో కూడా మెగ్నీషియం ఉంటుంది. ఎముకలు గట్టిగా ఉండాలన్నా, నరాలు, నాడీవ్యవస్థ చక్కగా ఉండాలన్నా మెగ్నీషియం అవసరం. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే మెగ్నీషియం కావాలి. మగవాళ్లకు రోజుకు 400 మి.గ్రా. మెగ్నీషియం అవసరం. మహిళలకు 300 మి.గ్రా. అవసరం.

మెగ్నీషియం లేకుంటే జరిగే అనర్థాలు 

జనరల్‌గా తినే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం ఇస్తాయి. అలాగని పదే పదే కిడ్నీలపై ఆధారపడితే.. సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాదు.. కిడ్నీలు కూడా పాడవుతాయి. మెగ్నీషియం సరిపడా లేనప్పుడు మనకు కొన్ని సింప్టమ్స్ ద్వారా గుర్తించవచ్చు.

లక్షణాలు 

మెగ్నీషియం లోపం ద్వారా ఆకలి వేయదు. వికారంగా ఉంటుంది. వామ్టింగ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. గుండె కొట్టుకొనే వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్లకు మసకగా అనిపిస్తుంది. కండరాల్లో నొప్పి వస్తుంది. అలసట ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. హైబీపీ వస్తుంది. అస్తమా సమస్య కూడా పెరుగుతుంది. మెగ్నీషియం వెంటనే రావాలంటే ఓ కాఫీ తాగేయాలి. డార్క్ చాకొలెట్ తినేయాలి. అదేపనికా డార్క్‌చాకొలెట్స్ తినడం మంచిది కాదు. రోజుకొకటి తినొచ్చు అలాగని మెగ్నీషియం కోసం దానిపైనే ఆధారపడకుండా కాయగూరలు, ఆకుకూరలు తినాలి.

మెగ్నీషియం ఉండే ఆహారాలు 

– ఆకుకూరలు
– పండ్లు (ఫిగ్స్, ఆవకాడో, అరటిపండ్లు, రాస్ బెర్రీస్)
– బ్రకోలి, క్యాబేజ్, గ్రీన్‌బఠాణీలు, మొలకల వంటివి.
– సీఫుడ్
– బ్రౌన్‌రైన్, ఓట్స్
మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే చాలా జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే ఆనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వీలైనంతవరకూ ఫ్రైఫుడ్ తగ్గించి.. సహజమైన ఆహారం తినండి. పండ్లు, పప్పులు తినండి. అలాగే.. కాయగూరలు, ఆకుకూరలు తినండి. ఐతే మెగ్నీషియం ఎక్కువైతే కూడా ఇబ్బందే.. డయేరియా, కడుపుతో నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి.. ఎంత మెగ్నీషియం అవసరమో డాక్టర్ సలహా పాటించడం మేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version