శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఇది తరువాత అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణులు తరచుగా పురుషులు రోజుకు 3.7 లీటర్లు మరియు స్త్రీలు రోజుకు 2.5 లీటర్ల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు. తగినంత నీరు త్రాగడం వల్ల శరీరాన్ని అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు. అయితే కొందరు ఏ నీరు తాగాలనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బ్లాక్ వాటర్, మినరల్ వాటర్ సహా ఎన్నో రకాల నీళ్లు అందుబాటులో ఉన్నాయి వీటిని ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. అయితే ఎలక్ట్రోలైట్ వాటర్ గురించి మీకు తెలుసా? ఎలక్ట్రోలైట్ వాటర్ అంటే ఏమిటి మరియు దానిని రోజూ తాగొచ్చా, అందరూ ఈ వాటర్ తాగొచ్చా ఎవరైనా తాగకూడదా.. లేదా తెలుసుకుందాం.
ఎలక్ట్రోలైట్ వాటర్ అంటే ఏమిటి?
పొటాషియం, మెగ్నీషియం, సోడియం, మినరల్స్ కలిపి ఈ నీటిని తయారుచేస్తారు. ఎలక్ట్రోలైట్స్ నీరు మీ గుండె మరియు మూత్రపిండాలకు చాలా ముఖ్యమైనది. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి..
రోజూ ఈ నీటిని తాగవచ్చా?
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నవాళ్లు రోజూ ఈ నీటిని తాగాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎలక్ట్రోలైట్ నీరు అథ్లెట్లకు లేదా సుదీర్ఘ శారీరక శ్రమలో పాల్గొనేవారికి మరింత ముఖ్యమైనది. ఆట సమయంలో మైదానంలో ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తాగడం చాలా మంది ఆటగాళ్లను మీరు చూసి ఉండవచ్చు. ఇది త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.
ఎవరు ఈ నీళ్లు తాగకూడదు..
సాధారణ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగితే సమస్యలు ఎదురవుతాయట. ఇది వారి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌కు భంగం కలిగించవచ్చు. కిడ్నీ మరియు హై బీపీ ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగకూడదు. ఇది కాకుండా, విరేచనాలు లేదా కండరాల తిమ్మిరి సంభవించినప్పుడు కూడా ఎలక్ట్రోలైట్ నీటిని తాగకూడదు.