ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో.. దాంతో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

-

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. తినే తిండిని ఆపి ఫాస్టింగ్ ఉండ‌డం అన్న‌మాట‌. దీన్ని అనేక ర‌కాలుగా చేయ‌వ‌చ్చు. అంటే.. రోజు మొత్తంలో కేవ‌లం 8 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకోవాల‌న్న‌మాట‌.

ఉప‌వాసం.. దీన్నే ఇంగ్లిష్‌లో ఫాస్టింగ్ అని కూడా అంటారు. ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే ఫాస్టింగ్ అనేది వారంలో ఒకటి లేదా రెండు రోజులు చేస్తారు. దీంతో ఆ రోజు మొత్తం ఏమీ తిన‌కుండా ఉంటారు. అయితే అలా కాకుండా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయ‌వ‌చ్చు. దీంతోనూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. తినే తిండిని ఆపి ఫాస్టింగ్ ఉండ‌డం అన్న‌మాట‌. దీన్ని అనేక ర‌కాలుగా చేయ‌వ‌చ్చు. అంటే.. రోజు మొత్తంలో కేవ‌లం 8 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకోవాల‌న్న‌మాట‌. మిగిలిన 16 గంట‌లు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. కేవ‌లం నీరు మాత్ర‌మే తాగ‌వ‌చ్చు.



ఆ 8 గంట‌ల స‌మ‌యంలో మీకు న‌చ్చిన‌, మీకు ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని తిన‌వ‌చ్చు. ఇక ఆ 8 గంట‌లను మీరు రోజులో ఎప్పుడైనా పాటించ‌వ‌చ్చు. అంటే.. ఉద‌యం 8 గంట‌ల‌కు తిన‌డం ప్రారంభించార‌నుకుంటే.. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కే తినాలి. ఆ త‌రువాత ఏమీ తిన‌రాదు. మ‌ళ్లీ మ‌రుస‌టి రోజు ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు ఫాస్టింగ్ ఉండాలి. దీన్నే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు.

అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 8 గంట‌లు మాత్ర‌మే తినాల‌ని ఏమీ లేదు. కొంద‌రు దీన్ని 6, 4 గంట‌లు పాటిస్తారు. అంటే.. 24 గంట‌ల్లో 6 లేదా 4 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకుంటార‌న్న‌మాట. మిగిలిన 18 లేదా 20 గంట‌ల పాటు ఏమీ తిన‌ర‌న్న‌మాట‌. ఇలా కూడా కొంద‌రు చేస్తారు. దీన్ని కూడా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే అంటారు. అయితే పైన చెప్పిన మూడు ప‌ద్ధ‌తుల్లో ఏ రక‌మైన ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా స‌రే.. కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే…

1. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ పూర్తిగా అదుపులోకి వ‌స్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

2. ఈ ఫాస్టింగ్ వ‌ల్ల అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు త‌గ్గిన బ‌రువును నియంత్ర‌ణ‌లో కూడా ఉంచుకోవ‌చ్చ‌ట‌.

3. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ రాకుండా ఉంటాయి.

4. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

5. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version