మేం భాద‌లో ఉంటే త‌ప్పుడు వార్త‌లా : వైఎస్ సునీతా రెడ్డి

-

నాన్నను చంపిన వాళ్లు ఎవరైనా.. ఎంత పెద్దవాళ్లయినా వాళ్లకు శిక్ష పడాల్సిందే. అధికారంలో ఉన్న కొందరు సిట్ విచారణ పూర్తి కాకముందే తమ నిర్ణయాలు చెబుతున్నారు.

జగనన్నను సీఎంగా చూడాలన్నదే నాన్న కోరిక అని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి తెలిపారు. తన తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో తాము ఉంటే.. ఆయన మృతిపై పేపర్లు, మీడియాలో వచ్చిన వార్తలు తమను మరింత బాధ కలిగిస్తున్నాయని ఆమె వాపోయారు. ఇవాళ పులివెందులలో ఆమె మీడియాతో మాట్లాడారు.

పులివెందులతో నాన్నకు ఎంతో అనుబంధం ఉంది. పులివెందుల ప్రజలంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్నకు కుటుంబం కన్నా ప్రజలే ముందు. వాళ్ల తర్వాతే కుటుంబం. జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నాన్న కోరిక. దాని కోసమే ఎన్నికల ప్రచారం చేయడం కోసం చాలారోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. పార్టీ కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడ్డారు. తన తుది శ్వాస విడిచే వరకు నాన్న పార్టీ బాగుకోసమే పనిచేశారు. నాన్నకు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండటమే ఇష్టం. అందుకే నాన్నను అందరూ అభిమానిస్తారు.. అని ఆమె తెలిపారు.


నాన్నను అతి కిరాతకంగా హత్య చేశారు..

నాన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. నాన్న హత్యకు సంబంధించి సరైన విచారణ జరగుతలేదు. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని.. ఇంకేదో అంటూ ప్రచారం చేస్తున్నారు. అదంతా అవాస్తవం. నాన్న చనిపోయిన బాధలో మేము ఉంటే మరోవైపు ఆయన మృతిపై వస్తున్న వార్తలు మమ్మల్ని మరింత బాధకు గురి చేస్తున్నాయి. సిట్ తన పని తాను చేసుకోవాలి. మా ఫ్యామిలీ చిన్నది కాదు.. దాదాపు 700 మంది మా ఫ్యామిలీలో ఉంటారు. అందరం కలిసిమెలిసి ఉంటాం.. అని తెలిపారు.

దోషులు ఎంత పెద్దవాళ్లు అయినా.. వాళ్లకు శిక్ష పడాల్సిందే

నాన్నను చంపిన వాళ్లు ఎవరైనా.. ఎంత పెద్దవాళ్లయినా వాళ్లకు శిక్ష పడాల్సిందే. అధికారంలో ఉన్న కొందరు సిట్ విచారణ పూర్తి కాకముందే తమ నిర్ణయాలు చెబుతున్నారు. సిట్ విచారణ జరుగుతుంటే మధ్యలో వాళ్లు మాట్లాడటం ఎందుకు. నాన్న రాసిన లేఖ గురించి ఫోరెన్సిక్ నివేదిక నిజాలు బయటికి తీస్తుంది. సిట్ నిష్పాక్షిమైన విచారణ చేయాలని మేం కోరుతున్నాం. నాన్న చనిపోయారని తెలుసుకొని ఇంటికి వచ్చిన నాన్న సన్నిహితులను అనుమానించడం కరెక్ట్ కాదు. వాళ్లే తప్పు చేశారని ముందే ఎలా చెబుతారు.. అంటూ సునీతా రెడ్డి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version