తెల్లజుట్టు వస్తుందా? అయితే ఇక ఆపేయండి..

-

తెల్లజుట్టుని ఆపేదెలా..
చిన్న వయసులోనే జుట్టు నెరవడం. వయసుతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలు రావడం. ఇవన్నీ నేటితరానికి సమస్యలుగా మారాయి. వాటిని పరిష్కరించేందుకు ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ శరీరానికి అంత మంచిది కాదు. ఇంట్లో ఉండే ఔషదాలను వాడడం వల్ల జుట్టురంగు మారటాన్ని కొంత మేరకు అయినా ఆపవచ్చు. ఆ పద్ధతులేంటో తెలుసుకోండి.

– చాలామంది తక్కువ సమయంలోనే జట్టు రంగు మార్చడానికి కలర్‌ వేస్తుంటారు. ఇది కొన్ని రోజులకు మాత్రమే పరిమితం. తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తుంది.
– ఉసిరికాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను కొబ్బరినూనెలో కలిపి నల్లగా మారే వరకు వేడిచేయండి. వచ్చిన మిశ్రమాన్ని జుట్టుకు రాయాలి. కొన్ని గంటల తర్వాత తలస్నానం చేస్తే సరి.
– కరివేపాకు కొబ్బరినూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి తలకు రాయాలి. ఇలా చేయడం వల్ల తల వెంట్రుకలు తెల్లగా మారడాన్ని నివారిస్తుంది.
– జుట్టు రంగు మారడానికి ఒత్తిడి కూడా కారణం అని చెప్పవచ్చు. అధిక ఒత్తిడి వల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు రంగు మారకూడదు అనుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీంతో మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుంది.
– చిన్న చిట్కాలతో కూడా తెల్లజుట్టు సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. చేతి గోళ్ళ వేళ్ళతో, మరో చేతి గోళ్ళను కనీసం ఐడు నిమిషాలపాటు రుద్దాలి. ప్రతిరోజూ మూడుసార్లు ఇలా చేయాలి. ఇలా చేస్తే జట్టు రాలడమే కాదు తెల్లబడడమూ ఆగిపోతుంది. అంతేకాక అప్పటి నుంచి జట్టు ఒత్తుగా, నల్లగా మారడం మొదలవుతుంది.
– ఈ ప్రయోగం వేలమందిపై ప్రయోగించగా వయసుతో పనిలేకుండా విజయవంతమైంది. అప్పటి నుంచి ఆయుర్వేద వైద్యంలో దీనిని భాగం చేశారు.
కింది ఇచ్చిన వాటన్నింటినీ బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేస్తే జట్టు నల్లబడుతుందని ఆయుర్వేదం చెబుతున్నది.

అవేంటంటే..
ఉసిరి చూర్ణం : 10 గ్రా.
నిమ్మరసం : 4 స్పూన్లు
కాపీపొడి : 3 గ్రా.
మెత్తగా రుబ్బిన గోరింటాకు : 100 గ్రా.
పెరుగు : 25 గ్రా.
బ్రహ్మి చూర్ణం : 10 గ్రా.
ఖదిరము (కటేచు : 3 గ్రా.
వీటన్నింటినీ బాగా కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాలలు నీడలో ఆరబెట్టి, నీటితో శుభ్రపరుచుకోవాలి. క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయని ఆయుర్వేదం తెలియజేస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version