రాత్రిపూట మనకి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. రకరకాల కలలు వస్తూ ఉంటాయి. పీడకలలు వంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు మన సక్సెస్ గురించి.. కొన్ని కొన్ని సార్లు అనారోగ్య సమస్యల గురించి ఇలా ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నిద్రలో కలలకి ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం కూడా. అయితే రాత్రిపూట వచ్చిన కలల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఉదయం అయ్యే సరికి వచ్చిన కల గుర్తుండదు. అసలు ఎందుకు రాత్రి వచ్చిన కలల్ని మర్చిపోతాం..? దానికి కారణం ఏంటి అనేది చూద్దాం. నిపుణుల చెప్తున్న దాని ప్రకారం చూస్తే.. వ్యక్తుల ప్రవర్తన అలాగే ఆలోచనలను బట్టి కలలు వస్తాయి.
కొన్ని కలలు ప్రమాదాలు వంటి వాటిని ముందుగా అలర్ట్ చేస్తాయి. కొన్ని కొన్ని సార్లు భయం, ఆందోళన నిజమైతే ఎలా ఉంటుందో అదే కల రూపంలో వస్తూ ఉంటుంది, ఒక్కోసారి వచ్చిన కలలు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. కానీ కొన్ని కలలను మాత్రం లేచిన వెంటనే మర్చి పోతూ ఉంటాం. కలలు నిజమైన సందర్భంలో అది ఇంతకుముందు జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
మెదడు అడ్వాన్స్డ్ గా రాబోయే కాలంలో ఏమవుతుంది అనేది ఊహించలేదు. ఊహించినా గుర్తు పెట్టుకోలేదు సైన్స్ టెక్నాలజీ లో ఇది వర్తించదు. ఆలోచించే విషయాలు అలాగే జీవితం గురించి అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మానసిక అచీతనస్థితి మాత్రమే ఇది దీనిని ఆటోనియా అని అంటారు. ఒకసారి మనకి కల వచ్చాక.. నిద్రలో లేచి ఉలిక్కిపడిన మరుక్షణం మళ్లీ బాడీ యాక్టివ్ అవుతుంది. అందుకని కల గుర్తుండదట. మంచి నిద్రలో ఉన్నప్పుడు మెదడులో ఉండే ఓ కీలకమైన రసాయనం తక్కువ స్థాయిలో ఉంటుంది అందుకని కలలు గుర్తు ఉండవట.