రాష్ట్రవ్యాప్తంగా కుల గణన కార్యక్రమం చేపట్టడం దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై సీఎం.. ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తోన్న యజ్ఞం ఇదని తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డ పై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని వ్యాఖ్యానించారు.
ఆకాశం – భూమి ఏకమై…
అవకాశాల్లో సమానత్వం…
అణగారిన వర్గాల
సామాజిక న్యాయం కోసం…
చేస్తోన్న యజ్ఞం ఇది.నేడు తెలంగాణ గడ్డ పై మొదలై…
రేపు రాహుల్ సారథ్యంలో
దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది.#TelanganaPrajaPrabhutwam #prajapalana pic.twitter.com/oeYYrxK5Ve— Revanth Reddy (@revanth_anumula) November 6, 2024