దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదని మండిపడ్డారు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణం అని ఆగ్రహించారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను అనర్హుల కింద తొలగించడం అన్యాయం అన్నారు.

వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదని ఫైర్ అయ్యారు. వెంటనే దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు వైఎస్ షర్మిల. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోందన్నారు. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయండి. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వానికి @JaiTDP @JanaSenaParty @BJP4Andhra దివ్యాంగులపై మానవత్వం లేదు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణం. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గం. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయం. అనర్హత పేరుతో… pic.twitter.com/xL7Ji6uAdj
— YS Sharmila (@realyssharmila) August 26, 2025