రాత్రిళ్ళు పిల్లల బట్టలను ఎందుకు బయట ఆరబెట్టకూడదు? సైన్స్ ఏం చెప్తోంది?

-

సహజంగా ఇంట్లో పెద్దలు పిల్లల బట్టలను రాత్రి సమయాల్లో బయట ఆరబెట్టకూడదని చెబుతూ ఉంటారు. అయితే దానికి సరైన కారణం తెలియకపోయినా సరే చాలా శాతం మంది వాటిని పాటిస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి సైన్స్ కు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఇటువంటి నమ్మకాలు అందరికీ ఉంటాయి. సహజంగా రాత్రి సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎప్పుడైతే రాత్రి సమయంలో పిల్లలు బట్టలు బయట ఆరబెడతారో దాని వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇలా చేయడం వల్లనే పిల్లలు ఆరోగ్యానికి హాని జరుగుతుందని నమ్ముతారు.

దాని వెనుక కారణం తెలియనప్పటికీ చాలామంది ఈ పద్ధతిని పాటిస్తారు. కానీ సైన్స్ ప్రకారం చూస్తే పగలు కంటే వాతావరణం రాత్రిపూట వేరుగా ఉంటుంది. రాత్రి సమయంలో బయట బట్టలు ఆరబెట్టడం వలన బట్టలు మంచు కారణంగా తడిగా మారుతాయి. అయితే దీనివలన చాలా రకాల బ్యాక్టీరియా, వైరస్ లు బట్టల పై పెరుగుతాయి. ఈ విధంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బట్టలపై ఉండే తేమ కీటకాలు, దోమలు వంటి వాటిని పెంచుతాయి మరియు రాత్రి సమయంలో ఇవి తేమ ఉండే బట్టల పై కూర్చుని గుడ్లు ధూళిని వదులుతాయి.

ఈ విధంగా పిల్లలకు ఎంతో ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కనుక బట్టలను ఉదయం ఆరబెట్టడం వలన వాటి పై ఎటువంటి బ్యాక్టీరియా మరియు వైరస్ వంటివి చేరవు. సూర్యరశ్మి వలన బట్టల పై హానికరమైన బ్యాక్టీరియా చేరదు. ఈ విధంగా పిల్లలు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది మరియు ఎలాంటి అలర్జీలు దరిచేరవు. ముఖ్యంగా సూర్య కిరణాలు బట్టల పై ఉండే తడిని తగ్గిస్తాయి. ఈ విధంగా దుర్వాసన కూడా పోతుంది. కనుక బట్టలను రాత్రి సమయాల్లో ఆరబెట్టకుండా ఉదయాన్నేసూర్యరశ్మి లో ఆరబెట్టడం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news