ఈ రోజుల్లో బరువు తగ్గాలని చాలామంది.. తెగ కష్టపడుతున్నారు. జిమ్ లో చెమటోడ్చి నానా తంటాలు పడుతున్నారు..కానీ ఓ మహిళ ఎలాంటి ఎక్సర్ సైజ్లు లేకుండా.. 50 కేజీలు తగ్గింది. కెనడాలోని అంటారియోలో నివసించే ఆలిస్ ఇంటర్నెట్ ప్రపంచంలో తన బరువు తగ్గించే కథను పంచుకుంది. కష్టపడకుండా.. ఇష్టమైనవి తయారు చేసుకుని, తిన్నది. ఆమె ఎలా అన్ని కేజీల బరువు తగ్గిందో చూద్దామా..!
50 కిలోల బరువు ఇలా తగ్గింది..
బరువు తగ్గాలనే ఆలోచన ఆలిస్‌కు 2020 సంవత్సరంలో ఆమె తన పెళ్లి గౌనును వేసుకున్నప్పుడు వచ్చిందట. ఇక అప్పటి నుంచి…కీటోను అనుసరించినట్లు చెప్పుకొచ్చింది. తొలినాళ్లలో ఇది చాలా కష్టంగా ఉండేది. కానీ, ఒక్కసారి శరీరం కీటోసిస్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఎలాంటి సమస్య ఎదురుకాలేదట. ఈ ప్రయాణంలో ఆమె ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటూ తనకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తింటూ బరువు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం, ఈ ప్రయాణంలో ఆలిస్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఆమె తన ప్రయాణంలో ఇంకా సంతోషంగా ఉంది.
బరువు తగ్గాలని మీరు కూడా మనసులో బలంగా డిసైడ్ అయ్యి.. డైట్ మొదలుపెడితే బరువు తగ్గడం పెద్ద విషయం కాదు. అయితే మీరు కూడా కీటో డైట్‌ను మొదలుపెట్టాలనుకుంటే.. వైద్యుల సలహా తీసుకుని..మాత్రమే స్టాట్ చేయాలి. మీ ఆరోగ్య పరిస్థితులని బట్టి డైట్ మొదలుపెట్టొచ్చా లేదా అని చెప్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మీ హెల్త్ హిస్టరీని బట్టి ఏ టైప్ సరిపోతుందో అది చూసి చెప్తారు.