సాధారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. కరోనా వైరస్ వచ్చిన అప్పటి నుంచి అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రిఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం విషయానికొస్తే ఇది అనుకున్నంత సులభం కాదు. వర్క్ ఫ్రం హోం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇలా కనుక ఫాలో అయితే మీకు సమస్యలు తలెత్తవు.
ఆఫీసులో పని చేసేది తొమ్మిది గంటలయితే సాధ్యమైనంత వరకు అదే సమయంలో పని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయండి. కానీ అదే పనిగా కుర్చీలో కూర్చుని పని చేస్తూ ఉంటె కుటుంబానికి సమయం కేటాయించడం సాధ్యపడదు. అయిదు నుంచి పది నిమిషాల పాటు విరామం తీసుకుంటే మీరు మరింత వేగంగా పని పూర్తి చేయడానికి సహాయం పడడమే కాక ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. పోషకాలు లభించే ఆహారం తీసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు.
వీలును బట్టి రెండు గంటలకు ఒకసారి ఒక 10 నిమిషాల పాటు మీ సిస్టమ్ ని పక్కన పెట్టేసి చిన్న చిన్న విరామాలు తీసుకోండి. వీలైతే షార్ట్ వాక్ చెయ్యండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీ కంపెనీలో పని చేస్తున్న తోటి ఉద్యోగులతో మీకు కలిగే ఇబ్బందుల గురించి చర్చించండి. ఇలా చేయడం వల్ల మీకు మరింత రిలీఫ్ కలుగుతుంది. వాళ్ల తోచిన సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల మీకు కలిగిన ఇబ్బంది తొలగిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో ఆఫీసు వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మీకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది.