కర్ణాటక బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది. బీజేపీ హైకమాండ్ అధినేత అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమైన చర్చలు జరిగాయని టాక్ అందుతోంది. అమిత్ షా తనను కలవడానికి జనార్ధన రెడ్డిని మాత్రమే ఎందుకు అనుమతించారు? అనే చర్చ జరుగుతోంది.

మరెవరినీ ఎందుకు అనుమతించలేదు..? అంటూ కర్ణాటక బీజేపీ పార్టీలో చర్చ జరుగుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి, అమిత్ షాతో సులభంగా సమావేశమై చర్చించడం బీజేపీలో కొత్త చర్చలకు దారితీసింది. మరి మాజీ మంత్రి శ్రీరాములు పరిస్థితి ఏంటి..? రాజీనామా చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే… కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం అందుతోంది.