ఈ రాశివారు శుభవార్తలు వింటారు..ధన లాభం..

-

మేషం:  చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల సమస్య పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది..

వృషభం: ముఖ్యసమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు. కొత్త వ్యాపార ఆలోచనలుకార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.ఆకస్మిక ధనలబ్ధి..ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం: కుటుంబంలో చికాకులు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు  నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

కర్కాటకం: బంధువులతో విభెదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలలోఆటుపోట్లు. ఉద్యోగులకు నిరుత్సాహం. కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి..

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. భాగస్వామ్య వ్యాపారాలు  లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్షా్యలు సాధిస్తారు.కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి..ఈరోజు చాలా మంచి రోజు..

కన్య: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమై సహకరిస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం. కొత్త ఉద్యోగం..వాహనాలు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

తుల: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు.కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. బంధువులు,మిత్రులతో విభేదాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పాడుతుంది.. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.కొత్త ఉద్యోగ అవకాశాలు..

మకరం: ఆర్థిక నష్టాలు అధికం..ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వాహనాలు, వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

కుంభం:  వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సన్నిహితులతో తగాదాలు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు..ఈ రోజు నష్టం అధికం..

మీనం: ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు..కావలసిన వాళ్ళతో ఉన్న వివాదాలు తొలగి పోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version