ఆహా.. ఇటువంటి టీటీఈలు కూడా ఉంటారా? నువ్వు గ్రేట్ బాసు..!

-

నిజంగా నువ్వు గ్రేట్ బాసు.. ఈరోజుల్లో ఇటువంటి టీటీఈలు ఉంటారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ దేశంలో ఇంకా నిజాయితీ బతికే ఉంది… జాలి, దయ కూడా బతికే ఉన్నాయని నిరూపించాడు ఆ టీటీఈ. సొల్లు ఆపి అసలు విషయం చెప్పమంటారా? ఛలో…

జలంధర్ నుంచి ఢిల్లీకి 75 ఏళ్ల వృద్ధురాలు వెళ్లాలి. టికెట్ రిజర్వేషన్ కూడా అయింది. సాయంత్రం ట్రెయిన్ ఎక్కాలి ఆమె. కాని.. ఆమె కొడుకు సాయంత్రం ట్రెయిన్ కు బదులు ఉదయం ట్రెయిన్ ఎక్కించాడు. అక్కడే జరిగింది పొరపాటు. ట్రెయిన్ లుధియానా చేరుకున్నది.. ఇంతలో టీటీఈ వచ్చాడు. ఆ ముసలావిడను టికెట్ అడిగాడు. టికెట్ చెక్ చేస్తే అది సాయంత్రం ట్రెయిన్ ది. రూల్స్ ప్రకారం ఆమెకు ఫైన్ వేశాడు ఆ టీటీఈ. అదే ట్రెయిన్ లో ఢిల్లీ వెళ్లేందుకు మరో టికెట్ ఇచ్చి.. దానికి రూ.2200 చెల్లించాలని ఆ ముసలావిడను అడిగాడు.

అయితే.. ఆ వృద్ధురాలు దగ్గర అంత డబ్బు లేదు. తన వద్ద అంత డబ్బు లేదని ఆ టీటీఈకి ఆమె చెప్పింది. దీంతో టీటీఈ తన ఔదార్యాన్ని ప్రదర్శించాడు. ఇతర టీటీఈల్లా కాకుండా ఆ డబ్బులు తానే చెల్లిస్తానని తెలిపాడు. ఇంతలో ఇదంతా గమనించిన తోటి ప్రయాణికులు తలా కొంత సేకరించి.. ఆమె టికెట్ డబ్బులు టీటీఈకి చెల్లించారు. దీంతో కథ సుఖాంతం అయింది.. కానీ.. టీటీఈ ఉదార స్వభావాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు అతడిని పొగడ్తల్లో ముంచెత్తడమే కాకుండా అతడిని సన్మానించనున్నట్లు తెలిపారు. నువ్వు గ్రేట్ బాసు..నిజంగా నువ్వు గ్రేటు.. సరైన టికెట్ ఉన్నా తెగ చిరాకు పడుతూ ఉంటారు కొంత మంది టీటీఈలు. వాళ్లందరికీ నువ్వు ఆదర్శం.

Read more RELATED
Recommended to you

Exit mobile version