ఈబేలో బిజినెస్‌..18 ఏళ్లకే.. నెలకు రూ. 27 లక్షలు సంపాదిస్తున్న యువతి..! 

-

వ్యాపారం చేయడానికి వయసుతో సంబంధంలేదని నేటి యువత నిరూపిస్తున్నారు. 18 ఏళ్ల వయసులోనే వ్యాపారం చేయాలనే ఆలోచన..రావడం.. రావడమే కాదు.. అది ఆచరణలో పెట్టింది. ఏదో సాదా సీదా వ్యాపారం..నెట్టుకొస్తుందిలే అనుకుంటారేమో.. సంపాదన చూస్తే ఫీజులు ఎగిరిపోవాల్సిందే. నెలకు రూ. 27లక్షలు పై మాటే.. ఉద్యోగం మాని వ్యాపారం మొదలుపెట్టి విజయవంతంగా దూసూకెళ్తున్న ఈ ఆస్ట్రేలియా భామ ఒలివియా పెర్కోకో (Olivia Percoco) గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.
ఆస్ట్రేలియా.. మెల్‌బోర్న్‌కి చెందిన ఒలివియా… 2020లో కరోనా రాకమందు సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంది. 2021 మధ్యలో.. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఈబే (eBay)లో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దూసుకెళ్తోంది. ఈబేలో ఆమె డ్రాప్ షిప్పింగ్ (dropshipping) వ్యాపారం ప్రారంభించింది. ఇదో డబ్బు సంపాదించే స్కీమ్. దీని ద్వారా… ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తుల్ని.. నౌకల ద్వారా దిగుమతి చేయించి.. రిటైలర్ల తరఫున కస్టమర్లకు చేరవేస్తారు. ఇది పెద్ద వింతేం కాదు.. దీనికే అంత మనీ వస్తుందా..? అదే కదా మీ డౌట్.
ఈ వ్యాపారంలో ఒలివియా… 2 ఏళ్లలోనే రూ.2,74,70,000 దాకా వెనకేసింది. ప్రస్తుతం నెలకు రూ.27 లక్షలకు పైగా సంపాదిస్తోంది. సోషల్ మీడియాని బాగా ఫాలో అయ్యే ఒలివియా… ఏది ట్రెండింగ్‌లో ఉందో… ఏ ఉత్పత్తులకు డిమాండ్ ఉందో బాగా గమనించి… తద్వారా ఎక్కువ లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా సమయంలో… డ్రాప్ షిప్పింగ్‌పై యూట్యూబ్ వీడియోలు చేసేది.

మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగం

ఈ వ్యాపారానికి ముందు మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగం చేసింది. కానీ అది ఆమెకు అస్సలు నచ్చేదికాదట. ఆ పని నచ్చక.. ఆన్‌లైన్‌లో డబ్బులు ఎలా సంపాదించాలో గూగుల్లో చూస్తుంటే..అప్పుడే ఈ డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుసుకుందట. డ్రాప్ షిప్పింగ్‌పై గంటలతరబడి రీసెర్చ్ చేసిన ఒలివియా… ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుంది. తర్వాత తను కూడా ప్రారంభించాలి ఫిక్స్ అయింది.
మొదట షాపిఫై (Shopify)అనే పాపులర్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ని ట్రై చేసిన ఒలివియా… దానికంటే ఈబే బెటర్ అనుకుంది. అంతే ఇక ఈబేలోకి మారిపోయింది. ఒలివియా… రకరకాల ఉత్పత్తులను అమ్ముతోంది. కాఫీ మెషిన్లు, గార్డెనింగ్ ఐటెమ్స్, మౌస్ ప్యాడ్లు, డెస్కులు, డై సప్లైస్, ఫోన్ కేసులు, హోమ్ స్టోరేజ్, ఆర్గనైజేషన్ ఉత్పత్తులు, డిజైనర్ క్లాత్స్, ట్రావెల్ ఐటెమ్స్ ను ఈ అమ్మాయి అమ్ముతోంది.
ఒలివియా అమ్మేవాటిలో ఏవీ సొంత వస్తువులు కావు. ఎవరైనా కస్టమర్ ఆర్డర్ ఇస్తే… వాటిని నౌకల్లో తెప్పించి… కస్టమర్‌కి ఈబే ద్వారా చేరవేస్తుంది. దీని వల్ల ఆమెకు భారీగా లాభాలు వస్తున్నాయి. ఒక రకంగా ఇది పెట్టుబడి లేని వ్యాపారం అనుకోవచ్చు. గతేడాది రివర్సబుల్ ఆక్టోపస్ ప్లష్‌ అనే వస్తువును వివరీతంగా అమ్మింది. అది టిక్‌టాక్‌లో వైరల్ అయ్యింది కూడా. ఈ సంవత్సరం స్టార్‌బక్స్ కాఫీ పాడ్ మిషన్‌ను జోరుగా అమ్ముడుపోతుందట.
ఎలాంటి వస్తువులపై పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారో..గమనిస్తూ… అలాంటి ఉత్పత్తుల్ని తన ఆన్‌‌లైన్ స్టోర్‌లో ప్రదర్శనకు ఉంచుతోంది. అందువల్లే ఆమె చూపిస్తున్న వస్తువులకు ఆర్డర్లు బాగా వస్తున్నాయట. ప్రస్తుతం ఒలివియా… పూర్తిస్థాయిలో ఇదే పని చేస్తోంది. భవిష్యత్తులో లగ్జరీ లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల్ని కూడా అమ్మే ఆలోచనలో ఉందట. తన వస్తువులపై వీడియోలు చేసి టిక్‌టాక్‌లో ప్రచారం కూడా చేసుకుంటుంది. ఇలా 18 ఏళ్లకే ఆమె సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్ అయిపోయింది.
టెక్నాలజీని ఇలా మంచికి వాడుకుంటుంటే.. హ్యాపీగా లైఫ్‌ సెట్‌ చేసుకోవచ్చని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది. సోషల్‌ మీడియాలో చాలామంది గంటల తరబడి టైం స్పెండ్‌ చేస్తారు. కానీ ఏం ఉపయోగం ఉండదు. నేటి యువతకు అబ్‌సర్‌వేషన్‌ చాలా ముఖ్యం.. దేన్నైనా ఈజీగా పట్టేయాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version