సుమారుగా 97 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన అనంతరం శివకుమార్‌కు మార్గమధ్యలో సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి వాహనం నడుపుతూనే పక్కకు ఒరిగాడు. అదే సమయంలో అతను చనిపోయాడు.
మనిషి జీవితం అంటే అంతే.. మనం ఎప్పటి వరకు జీవించి ఉంటామో మనకు తెలియదు. అసలు తదుపరి క్షణంలో మనకు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మన ప్రాణాలనేవి ఎప్పుడు పోతాయో మనం ఊహించడం కష్టం. ఇక మనం ఎంతగానో ప్రేమించే వారు ప్రాణాలను కోల్పోతుంటే.. ఆ సమయంలో మనం పక్కనే ఉంటే.. మనకు ఎంత బాధ కలుగుతుందో దాన్ని మాటల్లో వర్ణించలేం. సరిగ్గా అలాంటి స్థితే ఓ బాలుడికి ఎదురైంది. తన తండ్రి ఓ వైపు ప్రాణాలను కోల్పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయినప్పటికీ మరో ప్రమాదం జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. దీంతో తన సొంత ప్రాణాలనే కాదు.. రహదారిపై వెళ్లే వారి ప్రాణాలను కూడా కాపాడాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
కర్ణాటకలోని తూమకూరుకు చెందిన శివకుమార్ వృత్తి రీత్యా డ్రైవర్. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన ఓ పరిశ్రమలో తయారైన ప్రెషర్ కుక్కర్లను తన వాహనంలో ఎక్కించుకుని హులియారు అనే ప్రాంతంలో ఉన్న ఓ షాపుకు డెలివరీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో శివకుమార్ తన కుమారున్ని కూడా తన వాహనంలో ఎక్కించుకుని సరుకు డెలివరీ చేసేందుకు వెళ్తున్నాడు.
అయితే సుమారుగా 97 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన అనంతరం శివకుమార్‌కు మార్గమధ్యలో సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి వాహనం నడుపుతూనే పక్కకు ఒరిగాడు. అదే సమయంలో అతను చనిపోయాడు. దీంతో పక్కనే కూర్చున్న శివకుమార్ కుమారుడికి తన తండ్రి చనిపోయాడని తెలిసింది. కానీ మరో వైపు వాహనం రన్నింగ్‌లో ఉంది. అది అదుపు తప్పితే పక్కనే ఉన్న వాహనదారులపైకి దూసుకెళ్లేది. కానీ చాకచక్యంగా అతను స్టీరింగ్ పట్టుకుని వాహనాన్ని కంట్రోల్ చేశాడు. దాన్ని సేఫ్టీగా పక్కకు ఆపాడు. దీంతో అతను చూపిన చొరవకు అతన్ని అందరూ అభినందించారు. ఓవైపు తండ్రి చనిపోయినా.. మరోవైపు ఇతరులకు ప్రమాదం కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించినందుకు గాను ఆ బాలున్ని అందరూ ప్రశంసించారు. ఏది ఏమైనా.. ఇలాంటి స్థితి ఎవరికీ రాకూడదు కదా..!