మీరు ఇష్టపడే వాళ్ళని మీరు బాధ పెట్టారా…? అయితే ఇలా చేయండి…!

Join Our Community
follow manalokam on social media

కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఏదో ఒకటి అనడం లేదా ఇతరుల బాధించడం వంటివి చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళని బాధ పెట్టిన తర్వాత వాళ్ళు మాత్రమే కాదు మనం కూడా వాళ్లను బాధ పెట్టినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటాము. స్నేహితులని, పిల్లలని, పార్ట్నర్ ని, తోటి ఉద్యోగస్తులను… ఇలా ఎవరినైనా మనం బాధ పెడితే తిరిగి మళ్ళీ మామూలుగా ఉండాలి. అయితే వాళ్ళు బాధ పాడడం కంటే…. మనం బాధ పెట్టడం అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి…? వాళ్ళని బాధ పెట్టినందుకు మనం వాళ్లతో ఎలా కాంప్రమైజ్ అవ్వాలి. వీటి కోసం కొన్ని విషయాలు మీకోసం.

వినడం నేర్చుకోండి:

ఎవరినైనా మీరు బాధ పెట్టిన తర్వాత వాళ్లతో మాట్లాడండి. వాళ్లు చెప్పే మాటలు మీరు శ్రద్ధగా వినండి. వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళు ఎందుకు బాధ పడ్డారో మీరు తెలుసుకుని క్షమించమని కోరండి.

మీరు చేసిన తప్పును ఒప్పుకోండి:

నిజంగా ఇలా చేసినందుకు సారీ అని హృదయపూర్వకంగా వాళ్లతో చెప్పండి. అలానే మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి.

పదేపదే క్షమాపణ చెప్పండి:

వాళ్లు కనుక ఒకసారి వినకపోతే వాళ్లతో పదేపదే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలానే వాళ్ళు క్షమించే వరకు అనేక మార్లు క్షమాపణ కోరండి.

వాళ్లని బ్లేమ్ చేయొద్దు:

సాధారణంగా మనం తప్పు చేసినా కూడా బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ అలా చేయడం వల్ల తిరిగి స్నేహం ఏర్పడదు. కాబట్టి వాళ్ళని మీరు బ్లేమ్ చేయకుండా మీరు చేసిన తప్పులు అంగీకరించండి.

నిజాయితీగా ఉండండి:

నిజాయితీగా అవును నేను చేసినది తప్పే అని వాళ్ళ ముందు ఒప్పుకోండి. అలానే ఎంతో సిన్సియర్ గా మీరు వాళ్ళని క్షమాపణ కోరండి. దీనితో వాళ్ళు మిమ్మల్ని తిరిగి క్షమించవచ్చు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....