ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించారు. ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇష్టానురీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి ఇది కొత్త కాదు.. వైసీపీ రాజ్యం అనుకుంటున్నారు. ఎంపీడీవో జవహర్ బాబును అమానుషంగా కొట్టారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఎంపీడీవో రెచ్చగొట్టడంతోనే సమస్య పెద్దది అయిందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. అసలు ఘటన జరుగక ముందే టీడీపీ నేతలు అక్కడికి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. నిజాలు తేలిన తరువాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి.