పుష్ప-2 మూవీలో ‘సూసేకి’ సాంగ్ పుల్ వీడియో రిలీజ్

-

ఐకాన్ అల్లు అర్జున్-సుకుమార్ ల పుష్ప-2 రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. డిసెంబర్ 05న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టాలనే టార్గెట్ తో బరిలో దిగిన పుష్పరాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 22 రోజులకు 1719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏపాటిదో మరోసారి తెలియజేసింది.

ఈ సినిమాలోని సూసెకి పాట ఓ ఊపు ఊపింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రేయాఘోషల్ అద్భుతంగా పాడాడు. సినిమాలో జాతర సన్నివేశం తరువాత వచ్చిన ఈ పాట థియేటర్ లోనూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news