ఐఐటీ ఎంట్రెన్స్ లో ఫెయిల్ అయినా.. 1.2 కోట్ల వేతనంతో గూగుల్ లో జాబ్ కొట్టాడు..!

-

లండన్ ఆఫీసులో వచ్చే సెప్టెంబర్ నుంచి గూగుల్ సైట్ ఇంజినీరింగ్ బృందంలో మెంబర్ గా అబ్ధుల్లా పని చేయనున్నాడు. ఆయనకు ఏడాదికి 54.5 లక్షల మూల వేతనం, 15 శాతం బోనస్, 58.9 లక్షల కంపెనీ స్టాక్స్ ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది.

ట్రై.. ట్రై.. ట్రై.. టిల్ డై.. అన్నాడు ఓ మహానుభావుడు. అంటే… ఇంకో నిమిషంలో నువ్వు మరణిస్తావని తెలిసినా… విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండు.. అని అర్థం. ఓటమి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. జీవితమంతా ఓటమే ఉండదు. కాకపోతే విజయాన్ని ఓటములే మెట్లు. ఓటమి చెందగానే దిగులు పడి వెనుదిరిగితే విజయమనేది నీ దరికే రాదు. ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు అంటారా? ఇది సోది కాదు.. అక్షర సత్యం. అది నిజమని నిరూపించిన ఘటన ఇది.

ముంబైకి చెందిన 21 ఏళ్ల అబ్దుల్లాఖాన్ ఐఐటీలో చేరడానికి నిర్వహించే జేఈఈ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ముంబైలోని శ్రీఎల్ఆర్ తివారీ కాలేజీలో ఇంజినీరింగ్ లో చేరాడు. కంప్యూటర్ సైన్ ఇంజినీరింగ్ చేశాడు. అయితే.. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చాలెంజ్ లో అబ్దుల్లాఖాన్ ప్రొఫైల్ గూగుల్ కంట పడింది. దీంతో అతడికి ఆన్ లైన్ లో పలు పరీక్షలు నిర్వహించింది. చివరి టెస్ట్ కోసం అతడిని లండన్ లోని ఆఫీసుకు రావాలని తెలిపింది. తన చివరి ఇంటర్వ్యూ కోసం ఖాన్.. లండన్ వెళ్లాడు. అక్కడ జరిగిన ఇంటర్వ్యూలోనూ అబ్దుల్లాఖాన్ సెలక్ట్ అవ్వడంతో అతడికి 1.2 కోట్ల వేతనంతో గూగుల్ ఉద్యోగంలోకి తీసుకుంది.

లండన్ ఆఫీసులో వచ్చే సెప్టెంబర్ నుంచి గూగుల్ సైట్ ఇంజినీరింగ్ బృందంలో మెంబర్ గా అబ్ధుల్లా పని చేయనున్నాడు. ఆయనకు ఏడాదికి 54.5 లక్షల మూల వేతనం, 15 శాతం బోనస్, 58.9 లక్షల కంపెనీ స్టాక్స్ ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది.

అయితే.. గూగుల్ తనకు ఇంత భారీ వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటుందని అనుకోలేదని అబ్ధుల్లా తెలిపాడు. ఐఐటీయేతర విద్యార్థి అయి 1.2 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్ లో ఉద్యోగం సంపాదించిన మొట్టమొదటి వ్యక్తిగా అబ్ధుల్లా రికార్డుకెక్కాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version