ఒక్కొక్కసారి మూడ్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. దాని నుంచి బయటపడడం కూడా కష్టమైపోతుంది. దాని నుండి బయట పడక పోతే మరి ఏ పని చేయడం కూడా కుదరదు. దీంతో సమయం కూడా వృధా అయిపోతుంది. ఇలా చాలా నష్టాలు కలుగుతాయి. దీని కంటే కూడా మనం బ్యాడ్ మూడ్ నుంచి బయట పడటం కోసం ప్రయత్నం చేస్తే తిరిగి మళ్ళీ మనం మన పనులు చేసుకోవడానికి వీలు అవుతుంది. దీని నుంచి బయటపడడానికి విధానాలు ఇవే…
స్నేహితులతో మాట్లాడండి:
మీ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా స్నేహితులతో కాల్స్ లేదా టెక్స్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల కాస్త నవ్వుకుంటూ సరదాగా గడపడానికి వీలవుతుంది. దీనితో మీరు మీ బ్యాడ్ మూడ్ నుండి బయటపడగలరు.
బయటకు వెళ్లడం:
సరదాగా మీరు వాకింగ్ చేయడం, లేదంటే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ పని చేయండి. ఇలా ప్రకృతి మధ్యలో కాస్త సమయం గడిపితే మీ ఫ్రస్ట్రేషన్ పోతుంది.
స్విమ్మింగ్ లేదా షవర్ చేయడం:
బ్యాడ్ మూడ్ నుండి బయటపడాలంటే స్విమ్మింగ్ చేయడం లేదా షవర్ చేయడం లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీరు బ్యాడ్ మూడ్ నుండి బయటపడవచ్చు.
మెడిటేషన్ చేయడం:
కాసేపు మీరు మెడిటేషన్ చేసినా మీ బ్యాడ్ మూడ్ మారిపోతుంది. లేదా మీరు మీకు నచ్చిన పుస్తకం లేదా వాల్ పెయింట్ వేయడం, గార్డెనింగ్ చేయడం లాంటివి కూడా చేయొచ్చు.