స్ఫూర్తి: రూ.600 కోట్లు టర్నోవర్‌… ఈ తోడికోడళ్లు సక్సెస్ స్టోరీ ని చూస్తే శభాష్ అంటారు..!

-

అనుకున్నది సాధించడం అంత ఈజీ కాదు అనుకున్నది సాధించాలంటే దానికి తగ్గట్టుగా కష్టపడాలి. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కలలు కొన్ని ఆశయాలు ఉంటాయి. వాటిని తలచుకోవడం వాటిని చేరిపోయామన్నట్లు కలలు కనడం ఈజీయే కాని జీవితంలో వాటిని రీచ్ అవ్వడం చాలా కష్టం. ఈ తోటి కోడళ్ల సక్సెస్ స్టోరీ ని చూశారంటే మీరు కూడా శభాష్ అంటారు. వీళ్ళిద్దరూ 600 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు మరి వ్యాపారం ఏమిటి ఎలా సక్సెస్ అయ్యారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

అరికా జైన్, కిమీ జైన్ ఇద్దరు కూడా తోటుకోడళ్ళు. ఈ తోడికోడలు ఇద్దరు 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ అంటే టాయిలెట్లు లో ఉపయోగించే సబ్బులు షాంపూలు టూత్ పేస్టులు టాయిలెట్ పేపర్స్ హెయిర్ కండిషనర్స్ ఇటువంటివన్నీ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. కరోనా మహమ్మారి సమయంలో ఉపయోగించే వస్తువులను కూడా తయారు చేయడం మొదలుపెట్టారు.

కెనడా కి చెందిన ఉత్పత్తుల తయారు సంస్థలు లో భాగస్వామ్యం ఉంది వీళ్ళకి. తక్కువ కాలంలోనే వీరి యొక్క వ్యాపారం 600 కోట్లకు పెరిగింది. వీళ్ళ కంపెనీ పేరు కిమీరిక. ఒకరోజు తన భర్తతో పాటుగా అరిక హోటల్ కి వెళ్ళింది. అక్కడ రూమ్ లో టాయిలెట్రీ వస్తువులని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నట్లు ఆమె గుర్తించారు. అప్పుడే ఆమెకి ఈ ఆలోచన వచ్చింది వెంటనే ఆమె ఈ వ్యాపారని మొదలుపెట్టారు.

తర్వాత ఈమె ఓ ప్రముఖ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు ఇలా 600 కోట్లు
టర్నోవర్ వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఒక గ్రామంలో కిమీ జాయిన్ జన్మించారు. 1991లో ఇండోర్ కి వెళ్లి చదువుకున్నారు. ఇప్పుడు ఈమె 600 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. వీళ్లల్లో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు మరిన్ని మైల్స్టోన్స్ నీ రీచ్ అవ్వాలని కోరుకుందాం..

Read more RELATED
Recommended to you

Latest news