మనం కష్టపడిన దానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. ప్రయత్నం చేయకపోవడం మన తప్పు. ప్రయత్నం చేసి మనం ముందుకు వెళ్తే కచ్చితంగా సక్సస్ అవ్వగలరు. ఈ విషయాన్ని ఒక ప్యూన్ నిరూపించారు. కాలేజీలో ప్యూన్ గా పనిచేసి అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మారిపోయారు.
నిజానికి ఇది కదా సక్సెస్ అంటే. ఉదయం పూట కాలేజీ కి వెళ్లి.. మధ్యాహ్నం అటెండర్ గా పని చేసేవారు. చదువు మీద ఆసక్తి ఉండడంతోనే ఇలా చదువుకోగలిగారు. ఇప్పుడు నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ కి చెందిన కిషోర్ మండల్ పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రోడ్డు మీద టీ అమ్ముకునే వారు. కిషోర్ కి చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టం. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల చదువుకోలేదు. 2003లో నైట్ వాచ్మెన్ కింద చేరారు. 2008లో కాలేజీ లో అటెండర్ గా పని చేసేవారు కానీ అక్కడ విద్యార్థులు అధ్యాపకులుని ఆదర్శంగా తీసుకుని తాను కూడా చదువుకోవాలని అనుకున్నారు. సోషల్ వర్క్ లో పీజీని 2011లో పూర్తి చేసి… 2013లో పీహెచ్డి లో చేరి 2019లో పీహెచ్డీ ని కూడా పూర్తి చేసేసేవారు.
2020లో బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన రావడంతో ఆయన అప్లై చేశారు. ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ అయ్యారు. అంబేద్కర్ పీజీ కాలేజీ లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగాన్నీ సంపాదించారు.
మనసుంటే మార్గం ఉంటుంది అని ఈయన రుజువు చేశారు. పేదరికం కానీ అతని పరిస్థితులు కాని వయస్సు కాని ఇవేమీ అడ్డు రాలేదు. నిజానికి చాలా మంది ఇటువంటి వాటి వలన అసలైన దానిని వదిలేస్తూ ఉంటారు. చాలామంది చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు. పేదరికం లేదా ఇతర కారణాల వల్ల ఆపేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈయన్ని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు.