హరీష్ రావు భయం కేటీఆర్ ను వెంటాడుతుంది : కడియం శ్రీహరి

-

రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు బోనస్ 500 ఇస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తాం అన్నమాటకు కేటీఆర్ కట్టుబడి ఉండాలి అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అధికారం పోయిందన్న ఆకస్సుతో , ప్రజలను మరిచి అహంకారంతో ఉన్న వాళ్లు తెలంగాణ వనరులను దోచుకున్న వాళ్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ , బిజెపి పార్టీలకు రాష్ట్రం అభివృద్ధి చెందాలని , రైతులు అభివృద్ధి చెందాలని లేదు. మీరు చేసిన అప్పులకు మిత్తి కట్టలేక , వాయిదాలు చెల్లించలేకపోతున్నాం.

ఇక కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టి జైల్లో పెడతారు అంటున్నాడు. తొందర ఎందుకు కేటీఆర్ జైల్లో పెట్టే రోజు వస్తది, నిన్ను తప్పకుండా జైల్లో వేసి చిప్పకూడు తినిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, మీలాగా ఏకచత్రాధిపత్యం, నిరంకుశత్వం, మేం చెప్పిందే వేదం అనేలా ఉండదు. కేటీఆర్ కు జైల్లోకి వెళ్తా అనేదానికన్నా , హరీష్ రావు భయమే ఎక్కువగా పట్టుకుంది. హరీష్ రావుకు ఉన్న ప్రజాబలం నాకు లేదనుకుంటున్న కేటీఆర్.. భారత రాష్ట్ర సమితిని హరీష్ రావు కైవసం చేసుకుంటాడనే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ హరీష్ రావు భయం కేటీఆర్ ను వెంటాడుతుంది అని కడియం శ్రీహరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version