వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లును వెడల్పు చేసేందు రూ.47.85 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపడుతారు. మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్ల పనులకు పరిపాలక ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.