ఈమె ధైర్యానికి… ఈమె సాహసానికి సెల్యూట్ చెయ్యాల్సిందే. జీవిత చరమాంకంలో ఓ యుద్ధమే చేసింది! ఎవరు ఈమె మాట వైపు నిలబడకపోయిన… ఎందరో మంది ఎంత హెచ్చరించినా… ఈమె అనుకున్నది చేసింది. నిజంగా ఈమె 74 ఏళ్ల వయసు లో జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకుంది. ఇప్పుడు చక్కగా ‘అమ్మ’ అనే పిలుపులో ఉన్న కమ్మదనాన్ని తనివితీరా ఆస్వాదిస్తోంది. అసలు ఏం జరిగింది..?, ఈమె చేసిన ఆ సాహసం ఏమిటి..? ఈమె గురించి మరి ఇప్పుడే పూర్తిగా చూడండి…
కృత్రిమ గర్భదారణ పద్ధతిలో 2019 సెప్టెంబర్ 6న మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరినీ కూడా ఎంతో గారాబంగా ఈ వృద్ధ దంపతులు పెంచారు. పిల్లలకు ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరిపిన మూడు రోజులకే తండ్రి సీతారామరాజారావు మృతి చెందారు. మంగయమ్మే వాళ్లడిరని అప్పటి నుండి పెంచుతోంది. భర్త మృతితో మంగాయమ్మ బిడ్డల సంరక్షణ కోసం ఓ మహిళను నియమించారు. బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వాళ్ళు కూడా ఆ పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటారు. ఆ కవలలు అంటే ఇష్టం కూడా. మంగాయమ్మ తన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటికే చేయాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆమె తర్వాత తన అక్క పిల్లలు చూసుకుంటారని… ఆ పిల్లల గురించి దిగులు చెందవద్దన్నారు. ఆమె నూరేళ్లు బతికి ఆ పిల్లలని ఇలానే చూసుకోవాలని అంతా అంటున్నారు…