ఈ కథ చదివితే ‘కర్మ’ అంటే ఏంటో తెలుస్తుంది!

-

పూర్వం మన పెద్దలు చేసిన తప్పులు, పాపాలు వారి పిల్లలు అనుభవిస్తూ ఉంటారు అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరు చేసిన పాపకర్మలు ఏదో ఒక రూపంలో వారినే బాధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం.

ఒక వ్యక్తి ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల త్వరగా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లాలని కారు దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పటికే తన కారు దగ్గర ఒక కుక్క నిలబడి ఉంటుంది. అతను కార్ డోర్ తీసి వెళ్దాం అనుకున్న సమయంలో, ఆ కుక్క అతనిని కరుస్తుంది. అతడికి చాలా కోపం వచ్చి ఆ కుక్క మీద రెండు రాళ్లు విసురుతాడు. అయితే ఆ కుక్క తప్పించుకొని పారిపోతుంది.

అతను చాలా బాధ, కోపంతో ఆఫీస్ కి వెళ్తాడు. అంతలో అతని మేనేజర్ పలకరించడంతో ఆ కోపం మొత్తం మేనేజర్ మీద చూపిస్తాడు. మేనేజర్ చేసేది ఏమి లేక ఆ కోపాన్ని అంతటినీ తన కింద పనిచేసే ఉద్యోగుల మీద చూపిస్తాడు. ఇలా ఆ కోపం ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ.. చివరకు అక్కడ పనిచేసే వాచ్ మెన్ మీద ఆ కోపాన్ని చూపిస్తారు. అయితే నిజానికి ఆ వాచ్ మెన్ కు ఆ కోపానికి ఎటువంటి సంబంధము లేని విషయం అది.

సాయంత్రం పని ముగించుకొని అందరూ ఇంటికి వెళ్తారు. అలాగే వాచ్ మెన్ కూడా ఇంటికి వెళ్లి డోర్ కొట్టగానే, అతని భార్య తలుపు తెరిచి ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అడుగుతుంది. కోపంతో రగిలి పోతున్న అతను భార్యను లాగి ఒకటి కొడతాడు ఆమె కూడా కోపంతో టీవీ చూస్తున్న తన కొడుకు దగ్గరకు వెళ్లి చదువుకోకుండా ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటావా అని బాబుని కొడుతుంది. ఆ బాబు చేసేదేమీ లేక బయటకు ఆడుకోడానికి వెళ్తాడు. అలా ఆడుకోవడానికి బయటికి వెళ్ళినా కొడుకు మీద ఒక కుక్క వెంట పడుతుంది. ఆది గమనించిన ఆ పిల్లడు పక్కన ఉన్న రాయి తీసుకొని కుక్కను గట్టిగా కొడతాడు. దెబ్బ గట్టిగా తగలడంతో ఆ కుక్క విలవిలలాడిపోతుంది. ఈ కుక్కె మొదట్లో ఆ వ్యక్తిని కరిచిన కుక్క.. చూశారు కదా మనం చేసిన పాపం ఏ రూపంలో అయినా మన దగ్గరికి వస్తుంది అని చెప్పడానికే ఈ చిన్న కథ. కర్మ అంటే మనం చేసిన పని మళ్లీ మనకు తిరిగిరావడం. అది మంచి అయినా చెడు అయినా!

Read more RELATED
Recommended to you

Exit mobile version