చాణక్య చాలా విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఈ విషయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పకూడదని చాణక్య అన్నారు. మరి ఎవరితో ఎలాంటి విషయాలను చెప్పకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. వాటిని ముందే ఇతరులతో చెప్పకూడదు. వాటిని చెప్పడం వలన ఇతరులు వాటికి అడ్డుపడే అవకాశం ఉంటుంది. దీంతో మీరు విజయాన్ని అందుకోలేకపోవచ్చు కూడా.
అలాగే మీ కష్టాల గురించి ఎవరికీ చెప్పొద్దు. మీ కష్టాలు ఎదుటివారికి నవ్వులుగా అనిపిస్తాయి. దాని వలన మీకు ఇంకా ఇబ్బంది వస్తుంది తప్ప మీ కష్టాన్ని చెప్పుకోవడం వలన అది తీరిపోదు. అలాగే ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఇతరులకి చెప్పొద్దు. మీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు మీ వద్దకు రారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా మీ కలల గురించి మీ కోరికల గురించి చెప్పొద్దు.
కొంచెం క్లోజ్ గా ఉన్న వాళ్లకి కూడా చెప్పకూడదు. ప్రేమ విషయాలని, కుటుంబానికి సంబంధించిన విషయాలని కూడా ఇతరులతో చెప్పడం మంచిది కాదు. కాబట్టి వీటిని రహస్యంగా ఉంచడమే మంచిది. మీకు ఎదురైనా చెడు అనుభవాల గురించి ఇతరులకి చెప్పద్దు. చెప్తే మీ మనోధైర్యం దెబ్బతింటుంది. అలాగే కొన్నిసార్లు మీ సంతోషాన్ని కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. మీ సంతోషాలు అవతలి వాళ్ళు అసూయ పడేలా చేస్తాయి.