జీవితంలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే చాలు దాని వలన మనం ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వలన జీవితమంతా కూడా పాడైపోతుంది. జీవితంలో మనం చక్కగా పైకి రావాలన్నా అనుకున్నది సాధించాలన్నా యవ్వనం చాలా ముఖ్యమైనది.
యవ్వనంలో యువత జాగ్రత్తగా నడిస్తే చక్కగా ముందుకు వెళ్ళచ్చు లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆచార చాణక్య అంటున్నారు. దేశ పురోగతిలో యువతదే ముఖ్య పాత్ర కాబట్టి యువత యవ్వనంలో తప్పులు చేయకుండా విజయం పై శ్రద్ధ పెట్టాలి పైగా యవ్వనంలో ఉన్నప్పుడు అనుసరించే విధానాలు దేశాభివృద్ధి పై ప్రభావం చూపుతాయి.
చెడు పనులు చేయకూడదు:
యవ్వనంలో ఉన్నప్పుడు చెడు పనులు అసలు చేయకూడదు. ఇలా చేయడం వలన మీరు మంచి మార్గంలో వెళ్ళలేరు. మత్తు మొదలైన వాటికి దూరంగా ఉండాలి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రావు.
సోమరితనం
సోమరితనం వలన కష్టపడలేరు. కష్టపడితే కానీ ఏదీ రాదు. యువత యవ్వనంలో సోమరిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా జీవితం బాగోదు. సమయం విలువని తెలుసుకుని మంచిగా ముందుకు వెళితే విజయం మీదే.
కోపం
కోపం అసలు పనికిరాదు. కోపం వలన మనం చేయవలసిన పనిని మర్చిపోతూ ఉంటాము. పైగా కోపం ఒంటరిని చేసేస్తుంటే కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు కోపం కూడా పనికిరాదు.