Success Story : కష్టమే ఆమె విజయానికి ఆయుధం.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ అమ్మాయి!

-

తెలంగాణలోని కరీంగనర్‌ కి చెందిన యువతి అక్షిత ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. అనారోగ్యం వెంటాడినా కూడా ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఎంతో ఆదర్శంగా నిలిచింది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామనుకున్న అక్షిత అనారోగ్య కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని పక్కకు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నోటీఫికేషన్ల మీద దృష్టి పెట్టింది. బాగా కష్టపడి పట్టుదలగా చదివి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలని సాధించింది.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన అక్షిత.. తండ్రి పేరు కిషన్‌ రెడ్డి, తల్లి పేరు అరుణ. వీరు వ్యవసాయం పనులు చేసుకుంటూ తమ కుటంబాన్ని పోషించేవారు. వీరిది పేద రైతు కుటుంబం. అక్షితకు చదువంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తితో చదివేది. అక్షిత ప్రతిభను గుర్తించిన ఆ తల్లిదండ్రుల.. ప్రభుత్వ ఉద్యోగం సాధించేవరకు ఆమెని ఎంతగానో ఎంకరేజ్ చేశారు.చదువులో ఎంతో చురుగ్గా ఉండే అక్షిత.. చిన్నప్పుడు సివిల్స్‌ తన గోల్ గా పెట్టుకుంది. కానీ తనకి ఉన్న అనారోగ్య సమస్యలతో తన గోల్ ని మార్చుకుంది. టెన్త్, ఇంటర్‌లో టాప్‌ మార్కులని సాధించింది.

ఇక డిగ్రీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత.. సోదరుడి అండతో.. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ను సెలెక్ట్ చేసుకుంది. మొదటి సంవత్సరం పూర్తయ్యేలోపే నెట్‌, సెట్‌ పరీక్షలు రాసి వాటికి క్వాలిఫై అయ్యింది. తరువాత బీఎడ్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్షిత పీహెచ్‌డీ సెకండియర్‌ చదువుతోంది. ఒక వైపు చదువు సాగిస్తూనే తనకు దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తుంది. ఇక ఈ సమయంలో గురుకుల నోటిఫికేషన్‌ రావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యింది.

కష్ట పడి చదివి గురుకుల పీజీటీ, టీజీటీ, జేఎల్‌, డీఎల్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాను రెండు సంవత్సరాల నుంచి చదువుతున్నానని కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదివడం వల్ల సాధించా అని చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియా, సినిమాలు వంటి వాటిని టైం పాస్ కోసం కాకుండా వాటి నుంచి తాను ఎన్నో మంచి విషయాలని నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version