లక్షన్నర రుణమాఫీ కాకుంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి : నిరంజన్ రెడ్డి

-

రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర సర్కార్‌ రుణమాఫీ విషయంలో అన్నీ అబద్దాలే మాట్లాడుతుందని మండిపడ్డారు రుణమాఫీ మెుత్తం చేసినట్లు మాట్లాడుతున్నారు తప్ప.. ఎంతమందికి ఇచ్చారనేది లెక్క ఎందుకు చెప్పడంలేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు అర్హులకు లక్షన్నర రుణమాఫీ కాకుంటే (8374852619 నంబరుకు) వాట్సాప్‌కు వివరాలు పంపాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.

“రైతులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అమెరికా నుంచి డాలర్లు తీసుకొస్తారేమో. స్పష్టత ఇవ్వకుండా మొత్తం ఇచ్చినట్లు దబాయింపు చేస్తున్నారు. రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పాసు బుక్కులో, బ్యాంకు ఖాతాలో పేర్లు వేరుగా ఉన్నాయని కూడా రుణమాఫీ చేయడం లేదు. రుణమాఫీ చేయకుండా ఉండేందుకు ఏదో ఒక సాకు వెతుకుతున్నారు. లక్షన్నర లోపు రుణం ఉండి ఇంకా మాఫీ కాని రైతులు అన్నారు. సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఒక రకంగా చెబుతుంటే కొర్రీలు ఎందుకు వేస్తున్నారు? రైతులు బాగుండాలనన్న ఏకైక సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది.” అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version