యువతీ నీకు వందనం… నువ్వే మాకు ఆదర్శం

-

నువ్వు ఏదైనా సాధించాలని బలంగా సంకల్పిస్తే.. నిన్ను ఏ శక్తి కూడా ఆపజాలదు.. ఇది ఓ గొప్ప వ్యక్తి సూక్తి. అవును.. నువ్వు ఏది సాధించాలనుకుంటే అది సాధించొచ్చు. కాకపోతే.. నీ కోరిక బలమైనదై ఉండాలి అంటారు పెద్దలు. ఆ పెద్దలు ఊరికే చెప్పలేదు.. నిజమే చెప్పారు అని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఈ ఘటన జపాన్ లో జరిగింది. 19 ఏళ్ల రీ లిడా.. మారథాన్ లో పాల్గొన్నది. మారథాన్ అంటే తెలుసు కదా.. కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తాలి. రీ లిడా జట్టు కూడా పోటీకి సన్నద్ధమైంది. 42 కిలోమీటర్ల మారథాన్ అది. కానీ… ఆ మారథాన్ పూర్తవడానికి రీ లిడానే కారణం. అందుకే ఇప్పుడు మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం.

అందరూ పరుగు ప్రారంభించారు. జట్టులోని ఒక్కొక్కరు 3.5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఒకరు 3.5 కిలోమీటర్లు పరిగెత్తగానే మరొకరు పరుగు ప్రారంభిస్తారు. అలాగే రీ లిడా కూడా పరుగు ప్రారంభించింది. కాకపోతే తన లక్ష్యానికి 700 మీటర్ల దూరం ముందే తన కాలుకు గాయం అయింది. కుడి కాలు ఫ్రాక్షర్ అయింది. దీంతో తను పరిగెత్తలేకపోయింది. లిడాను పోటీ నుంచి తప్పుకోవాలని అక్కడున్న వారు అన్నారు. కానీ.. లిడా వినలేదు. పరిగెత్తలేకపోతేనేం. మోకాళ్లు ఉన్నాయి కదా అని మోకాళ్లపై నడవడం ప్రారంభించింది. మోకాలు చిప్ప రోడ్డుకు తాకి రక్తం కారుతున్నా ఆపలేదు. అలాగే 700 మీటర్లు పాక్కుంటూ వచ్చి లక్ష్యాన్ని చేరుకున్నది. ఈ ఘటనను చూస్తున్న వాళ్లంతా హతాశులయ్యారు. లిడా పాక్కుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు లిడాను తెగ మెచ్చుకుంటున్నారు. అంతే కాదు.. మారథాన్ ప్రాంతం కూడా చప్పట్లతో మార్మోగిపోయింది. వావ్.. లిడా అది స్పిరిట్ అంటే. అది కసి అంటే. గెలుపు మీద కసి ఉంటే.. ఏదైనా సాధించాలనే తపన ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదీ అడ్డంకి కాదని నిరూపించావు. హేట్సాఫ్. నువ్వే మాకు ఆదర్శం.

Read more RELATED
Recommended to you

Exit mobile version