సర్కార్ టీం మళ్లీ అగ్గి రాజేశారు

-

విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో తుపాకి, కత్తి సినిమాల తర్వాత వచ్చిన సినిమా సర్కార్. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా తమిళనాట సంచలనం విజయం అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అయితే కలక్షన్స్ తో పాటుగా సినిమా గురించి గొడవలు కూడా అన్ని జరుగుతున్నాయి. ఓ పక్క అన్నాడిఎంకె నేతలు మురుగదాస్ అండ్ విజయ్ ల మీద కేసులు వేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే నిర్మాత కళైపులి ఎస్ థను జోక్యంతో సినిమాలో అధికార పార్టీ అభ్యంతరం తెలిపిన సీన్స్ అన్ని కట్ చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ సర్కార్ గొడవ సర్ధుమనుగుతుంది అనుకుంటుంటే సినిమా సక్సెస్ ను పురస్కరించుకుని చిత్రయూనిట్ చేసుకున్న పార్టీలో కేక్ మీద వివాదానికి కారణమైన మిక్సీ, గ్రైండర్ లను ఉంచారు. అసలే భగ్గుమంటున్న అన్నాడిఎంకె నేతలకు మళ్లీ ఓ అవకాశం దొరికినట్టు అయ్యింది. సినిమాలో సీన్స్ అయితే తీసేయిస్తారు కాని కేక్ మీదది వారి వల్ల కాదని హ్యాపీగా కేక్ కట్ చేసుకుని పార్టీని ఎంజాయ్ చేశారట.

మరి ఈ విషయంపై మళ్లీ అధికార పార్టీ ఎలాంటి గొడవ చేస్తుందో చూడాలి. గొడవ సర్ధుమనుగుతుందనుకునే టైంలో చిత్రయూనిట్ చేసిన ఈ పనికి అందరు షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version